టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు విక్టరీ వెంకటేష్. రొమాంటిక్, మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో హీరోగా డిఫరెంట్ జోనర్స్ ని వెంకటేష్ టచ్ చేశాడు. అయితే వెంకటేష్ కెరియర్ లో స్ట్రైట్ చిత్రాలకంటే రీమేక్ మూవీస్ ఎక్కువగా ఉంటాయనే విమర్శ ఉంది. దానికి కారణం ఆయన కెరియర్ లో హిట్ అయిన చాలా చిత్రాలు రీమేక్ మూవీస్ గా తెరకెక్కినవే కావడం. రీమేక్ చిత్రాలతో హిట్స్ కొట్టడం ఇంకా కష్టమైన విషయం అని చెప్పాలి. దానికి కారణం పెర్ఫార్మెన్స్ ని మాతృకలో ఉన్న హీరోతో కంపారిజన్ చేస్తారు. ఏ మాత్రం నచ్చకున్న నెగిటివ్ కామెంట్స్ తో ప్రచారం చేస్తారు. అయితే ఈ విషయంలో వెంకటేష్ చేసినవి రీమేక్ చిత్రాలే ఎక్కువ అయిన కూడా తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో అందరిని అలరించాడు.
నటుడుగా తనదైన సత్తా చూపించాడు. అగ్రహీరోలతో కామెడీ టైమింగ్ ఉన్న హీరో అంటే వెంటనే ఎవరైనా వెంకటేష్ పేరు చెబుతారు. అతని సినిమాలలో యాక్షన్ ఎంతగా ఉంటుందో అంతే కామెడీ టచ్ కూడా ఉంటుంది. అందుకే వెంకటేష్ చిత్రాలు అందరికి నచ్చుతాయి. సీనియర్ హీరో అయిన తర్వాత రెగ్యులర్ కమర్షియల్ గా రొమాంటిక్ హీరో లాంటి పాత్రల జోలికి వెళ్లకుండా తన వయసుకి సరిపోయే కథలనే వెంకటేష్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అలాగే వెంకీమామ సినిమాతో హిట్ కొట్టాడు. తరువాత దృశ్యం, నారప్ప సినిమాలతో కూడా సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు.
అయినా కూడా ప్రస్తుతం ఆయన చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. సోలోగా నారప్ప తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని, అలాగే తేజ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు అనే టాక్ ఉన్న అవేమీ పట్టాలు ఎక్కలేదు. అయితే ఓమై కడపులే రీమేక్ లో దేవుడిగా అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ లో వెంకీ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా గెస్ట్ అపీరియన్స్ ఉన్న పాత్రలు చేయడానికి వెంకీ రెడీగా ఉన్నాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.