Venkatesh: విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఓరి దేవుడా’ రీసెంట్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళ్‌లో హిట్ అయిన ‘ఓ మై కడవులే’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు నే తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. ఇదొక ఫన్నీ ఫాంటసీ ఫిల్మ్.
తమిళ సినిమా ‘ఓ మై కడవులే’లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దేవుడి రోల్ లో కనపిస్తారు. ఈ పాత్ర నిడివి తక్కువైనప్పటికీ ఇది సినిమాలో ప్రాముఖ్యంగల పాత్ర. అయితే తెలుగులో ఈ రోల్‌లో విక్టరీ వెంకటేష్ నటించారు. ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించినట్లు ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవునిలా దర్శనమిస్తారు. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ పాత్రను బాగా పండించారు.
అయితే ఈ స్పెషల్ రోల్ కోసం విక్టరీ వెంకటేష్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే దానిపై సినీ సర్కిల్‌లో ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ఆయన ఈ సినిమా కోసం కేవలం ఐదు రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. అయితే ఈ ఐదు రోజుల షూటింగ్‌కుగాను ఆయన అక్షరాల రూ.3 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారంట. వర్కింగ్ డేస్ పరంగా చూస్తే ఈ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పాత్ర ప్రాముఖ్యతను బట్టి నిర్మాతలకు ఈ భారీ మొత్తం చెల్లించక తప్పలేదు.
Venkatesh: స్పెషల్ ఎట్రాక్షన్‌గా వెంకీ క్యారెక్టర్
హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో వెంకీ, విశ్వస్‌సేన్ కాంబినేషన్ సీన్లను తెరక్కెక్కించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే బడ్జెట్ మొత్తం రికవరీ జరిగిపోయింది. థియేటర్ లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వెంకీ ముంబైలో ఉన్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. వెంకటేష్ కు, సల్మాన్ కు ఉన్న దోస్తీ కారణంగా ఈ సినిమాలో వెంకీ నటిస్తున్నాడు. ఇదే సినిమాలో మరో కీ రోల్ జగపతి బాబు చేస్తున్నారట.