ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించనున్నందున, పనులు వేగవంతం చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద జరుగుతున్న చివరి పనులను మంత్రి పరిశీలించారు.
పనులను పరిశీలించిన మంత్రి వేముల.. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్త సచివాలయంలో జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు.
