బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ టార్గెట్ తో ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి కథ, కథనం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ తోనే దర్శకుడు గోపీచంద్ మలినేని చూపించేశారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మాస్ జాతరలా ఈ సినిమా ఉండబోతుందని సినిమా ప్రమోషన్ లో భాగంగా కూడా క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు బాలకృష్ణ, చిత్ర నిర్మాత, గోపీచంద్ మలినేని కూడా చెప్పుకొచ్చారు. ఇక తమన్ మ్యూజిక్ కూడా సినిమాని మరో ఎండ్ లోకి తీసుకెళ్తుంది అని బలంగా చెప్పారు. ఇలా భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో అదే రేంజ్ లో ఈ మూవీని కూడా ప్రేక్షకులు చూస్తారు. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ కొత్తకథని ఆశించరు కాని పవర్ ఫుల్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేస్తారు. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ లో చూపించరు.
ఇక కథలోకి వెళ్తే ఒకే తండ్రికి పుట్టిన అన్నాచెల్లెలుగా బాలకృష్ణ వరలక్ష్మి ఇందులో కనిపిస్తారు. అయితే అన్నయ్య ఎంతగా ప్రేమించిన అతనిని చెల్లెలు ద్వేషిస్తూ ఉంటుంది. అదే ద్వేషంతో తన అన్నకి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డిని పెళ్ళాడుతుంది. తన అన్నపై ప్రతీకారం తీర్చుకోవాలని చెల్లెలు భానుమతి భావిస్తుంది. ఈ క్రమంలో వీరసింహారెడ్డి ఫారిన్ లో ఉండగా అతనిని చంపేస్తారు. అయితే వీరసింహా రెడ్డిని చంపేసిన తర్వాత ఏం జరిగింది. భానుమతి తన అన్న గొప్పతనం ఎలా తెలుసుకుంది. శత్రువుల బారి నుంచి తనని తాను ఎలా కాపాడుకుంది. ఇక వీరసింహారెడ్డి కొడుకుగా మరో పాత్రలో బాలకృష్ణ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది.
కథాపరంగా చూసుకుంటే ఇప్పటికే టాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాషలలో వచ్చిన ఒక రొటీన్ ఫార్ములా కథ అని చెప్పాలి. అయితే దీనిని గోపీచంద్ మలినేని చెప్పే విధానమే ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. వీరసింహారెడ్డిగా పవర్ ఫుల్ పాత్రలో బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ అనే బ్రాండ్ గా కరెక్ట్ గా సరిపోయేలా యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెప్పించాడు. ఇక చెల్లెళ్ళు భానుమతిగా వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి పవర్ ఫుల్ రోల్ దొరికింది. ఇక కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ మూవీలో వీరసింహారెడ్డిని ఎదుర్కొనే విలన్ రోల్ లో పవర్ ఫుల్ గా కనిపించి మెప్పించాడు. ఇక శృతి హాసన్ పాత్ర గ్లామర్ కి, అలాగే పాటలకి పరిమితం అయ్యింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అవన్నీ ప్రేక్షకులని ఎంగేజ్ చేసే విధంగానే ఉండటం విశేషం.
అలాగే బాలకృష్ణ నోటి నుంచి వచ్చే డైలాగ్స్ కి ఫ్యాన్స్ నుంచి విజిల్స్ పడతాయి. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కంటెంట్ కి హైరిచ్ ఇస్తుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ ఎలిమెంట్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. భానుమతి రియలైజ్ అయ్యి తన అన్న గొప్పతనం అర్ధం చేసుకునే సన్నివేశాలలో బాలకృష్ణ కన్నీళ్లు పెట్టిస్తాడు. ఓవరాల్ గా ఈ మూవీ సంక్రాంతి ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంగేజ్ చేసే మాస్ జాతర అని చెప్పాలి. ఇక మాస్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.
గోపీచంద్ మలినేని కథకుడిగా కంటే దర్శకుడిగా తన రేంజ్ ఏంటో చూపించారు. బాలకృష్ణని ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటారో అలా చూపించడానికి పవర్ ఫుల్ ఎలివేషన్ సన్నివేశాలతో ఆద్యంతం మెప్పించాడు. సినిమాటోగ్రఫీ కూడా పాటలు, ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేసి మెప్పించారు. ఓవరాల్ గా గొప్ప సినిమా కాకపోయిన కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి విజిల్స్ వేసి చూడగలిగే సంక్రాంతి సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. లాంగ్ రన్ లో ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.