Veera Simha Reddy: తెలుగులో నందమూరి బాలయ్యకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నందమూరి బాలయ్య సింహ అని టైటిల్ లో పెట్టుకుంటే మాత్రం అది పెద్ద హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉంటుంది. అందుకే ఆయన సింహ అనే టైటిల్ ని తన సినిమాలో పెట్టుకుంటూ ఉంటారు. తాజాగా గోపిచంద్ మలినేనితో కలిసి చేస్తున్న సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ని ఖరారు చేయడం తెలిసింది. ఇప్పటి వరకు బాలయ్య సింహ టైటిల్ తో ఎన్ని సినిమాలు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరసింహారెడ్డి:
నందమూరి బాలయ్య రీసెంట్ సినిమా అయిన వీరసింహారెడ్డి టైటిల్ లో సింహ అనే పదాన్ని వాడారు. దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
జైసింహా:
బాలయ్య, కె.యస్ రవికుమార్ కలిసి చేసిన ఈ సినిమా.. 2018లో వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార నటించింది.
సింహా:
బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ ఏడాది హయ్యెస్ట్ టాలీవుడ్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార నటించింది.
లక్ష్మీనరసింహా:
తమిళంలో విడుదలైన ‘సామి’ సినిమాకు రీమేక్ గా లక్ష్మీనరసింహా సినిమా రాగా.. ఈ సినిమా మాస్ హిట్ గా నిలిచింది.
సీమసింహం:
బాలయ్య, సిమ్రన్, రీమా సేన్లు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ అధికారిగా నటించాడు.
నరసింహనాయుడు:
బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ బాలయ్య సినిమా.. తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా అప్పట్లో రూ.9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే రూ.30కోట్ల వరకు షేర్ ని సాధించింది.
సమరసింహారెడ్డి:
ఫ్యాక్షన్ సినిమాలకు క్రేజ్ తెచ్చిన సినిమాగా సమరసింహారెడ్డిని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బాలయ్య పక్కన సిమ్రన్, అంజలా ఝవేరి, సంఘవిలు నటించారు. రూ.6కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే.. ఇది ఏకంగా రూ.20కోట్లను రాబట్టింది. రూ.20కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు సినిమాగా సమరసింహారెడ్డి నిలిచింది.
బొబ్బిలి సింహం:
పాపులర్ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య చేసిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య పక్కన రోజా, మీనాలు హీరోయిన్లుగా నటించారు.
Veera Simha Reddy: సింహం నవ్వింది:
తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి బాలయ్య 1983లో సింహం నవ్వింది అనే సిపిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.