Vastu Tips: అంతా మంచే కలగాలని అందరూ కోరుకుంటారు. ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో తులతూగాలని అందరూ అనుకుంటారు. అయితే ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొన్ని ఇళ్లలో వాస్తు దోషాల వల్ల ఇది సాధ్యపడకపోవచ్చు. అయితే మీరు కొన్ని వాస్తు నియమాలను పాటించడం ద్వారా వాస్తు దోషాలను నివారించి.. అంతా మంచి కలిగేలా చేసుకోవచ్చు. ఇంతకీ ఎలా చేస్తే మేలు కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన ద్వారం వద్ద పచ్చదనం:
ఇంటి ప్రధాన ద్వారం అనేది వాస్తులో ఎంతో కీలకమైనది. అందుకే ప్రధాన ద్వారం ముందు పచ్చని కుండీలను ఏర్పాటు చేసుకుంటే మంచిదని వాస్తు వివరిస్తోంది. ఇంటి ప్రధాన ద్వారా వద్ద మొక్కలు ఉండటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందట. అయితే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.
బెడ్ రూం విషయంలో ఈ జాగ్రత్త పాటించండి:
మనలో చాలామంది ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకొని, బెడ్ రూం మాత్రం శుభ్రంగా ఉంచుకోరు. చిందర వందరగా అన్ని వస్తువులను విసిరేసినట్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం బెడ్ రూం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. బెడ్ రూంని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, అద్దం ఉంటే దానిపై ఏదైనా కప్పి నిద్రించాలట. అలాగే ముళ్ల పొదలాంటి బొకేలను బెడ్ రూంలో ఉంచుకోకూడదట. బెడ్ రూంలో పడుకునేటప్పుడు తూర్పు దిశలో తల ఉంచాలని, దక్షినం వైపు పాదాలు పెట్టి పడుకోవడం వల్ల మేలు కలుగుతుందట.
ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచుకోండి:
వాస్తులో ఇంటి ప్రధాన ద్వారా అన్నింటికన్నా కీలకం. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా లేదంటే నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా ప్రధాన ద్వారమే కారణం అవుతుంది. అందుకే వాస్తులో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాగా ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని వాస్తు చెబుతోంది. ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట.
ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకోండి:
ఇంట్లో వాస్తు దోషాలును నివారించడానికి తాబేలు బొమ్మను పెట్టుకోవడం మంచిదని వాస్తులో వివరించడం జరిగింది.
Vastu Tips: ఇంటి ఆవరణలో ఎర్ర మందారం చెట్టు పెట్టుకోండి:
వాస్తు దోషాలను ఒక్కొక్కటిగా నివారించడం కష్టం. అందుకనే వాస్తు నిపుణులు ఇంటి ఆవరణలో ఎర్ర మందార చెట్టును పెట్టుకోమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి.