Vastu Tips: చాలామంది కష్టపడి పని చేసినా కానీ ఇంట్లో రూపాయి కూడా నిలవడం లేదని చెబుతూ ఉండటం వింటూనే ఉంటాం. ఇలాంటివి వాస్తు దోషాల వల్ల కలుగుతుంటాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా లేదంటే మీ ఇంట్లో కనకవర్షం కురవాలంటే కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని వాస్తు చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏఏ విగ్రహాలు ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
తాబేలు:
ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదని భావిస్తే తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవాలని వాస్తు చెబుతోంది. తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బులు బాగా వస్తాయట. మామూలుగా అయితే తాబేలు విగ్రహాన్ని డ్రాయింగ్ రూంలో ఉంచితే బాగుంటుందని వాస్తు సలహా ఇస్తుంది.
చేపలు:
ఇంట్లో డబ్బు సమస్య ఉంటే ఇత్తడి లేదా వెండి చేపలను పెట్టడం వల్ల మంచి జరుగుతుందట. ఇంట్లో ఈశాన్యం వైపు చేపలను ఉంచాలని.. దీని వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయట.
Vastu Tips: ఏనుగు:
లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సిన వారు ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందట. ఇంట్లో వెండి లేదంటే ఇత్తడి ఏనుగు విగ్రహం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట.
హంస:
ఇంట్లో డబ్బు నిలవాలంటే హంస విగ్రహాన్ని పెట్టుకోవాలని వాస్తు చెబుతోంది. ఇంట్లో హంస విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగడంతో పాటు డబ్బు ప్రాప్తిస్తుందని వాస్తు ప్రకారం తెలుస్తుంది.