Vastu Tips: ఇంట్లో లాకర్ ను డబ్బుతో నింపాలా? మంచి రోజు ఏదంటే..
ప్రతి ఇంట్లో డబ్బు దాచుకొనేందుకు ఓ లాకర్ ఉంటుంది. అయితే, దీన్ని వాస్తు ప్రకారం ఉండాల్సిన దిశలో ఉంచితేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. లాకర్ ను సరైన దిశ, స్థానంలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం అల్మారా లేదా లాకర్ ఎక్కడ ఉంచుకోవాలనేది వాస్తు శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు.
అల్మారాలు, లాకర్ నిర్మించుకోవడానికి సైతం కొన్ని సమయాలను మంచివిగా పేర్కొంటున్నారు. స్వాతి, శ్రవణం, పునర్వసు, ఉత్తర, ధనిష్ట నక్షత్రాలు అల్మారా, లాకర్ నిర్మించుకొనేందుకు అనుకూలమైనవిగా వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే, శుక్రవారం రోజున కూడా లాకర్, అల్మారాల నిర్మాణానికి మంచిదిగా చెబుతున్నారు. ఈ తిథులకు, ముహూర్తాలకు చాలా ప్రాశస్త్యం ఉందని పండితులు పేర్కొంటున్నారు.
లాకర్ నిర్మాణం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ తిథులు అత్యుత్తమంగా భావించవచ్చని సూచిస్తున్నారు. లాకర్ నిర్మించే సమయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. చెక్క అల్మారా సన్నగా లేదా వెడల్పుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో తిండి, డబ్బు కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఒకే వెడల్పుతో కూడిన గదిని ఉంచుకోవాలని చెబుతున్నారు. ఏటవాలుగా ఉన్న అల్మారాలో డబ్బు నిలబడదట.
Vastu Tips ఏ దిక్కులో ఉండాలంటే..
లాకర్, అల్మారా తూర్పు లేదా, ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. సక్రమమైన పద్ధతిలో పూజ చేశాకే వస్తువులను అందులో ఉంచాలని సూచిస్తున్నారు. పండుగలు, శుభ సందర్భాలు, వేడుకల సమయంలో ఇష్టదైవాన్ని పూజించినట్లే లాకర్ ను కూడా పూజించాలి. దీని వల్ల ఆ ఇంటికి ఆశీర్వాదం లభిస్తుందట. అలాగే లాకర్ ఉన్ గదిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఆ గదిలో బట్టలు మురికిగా, అపరిశుభ్రంగా ఉంచుకోరాదు.