Vastu Tips: మనలో చాలామంది తమ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా, రకరకాల కారణాల వల్ల అది కుదరకపోవచ్చు. చాలామందికి తగినంత ఆదాయం లేకపోవడం, సమాజంలో గుర్తింపు లేకపోవడం, ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు రావడం, ఇంట్లో అనవసరమైన విషయాల మీద గొడవలు జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఈ సమస్య ఉంటే దానికి వాస్తు కారణం కావచ్చు. కాబట్టి ఇంట్లో వాస్తుని ముందుగా సెట్ చేసుకోండి.
ఇంటికి ఎక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండకూడదు:
చాలామంది డిజైన్ల పేరుతో ఎక్కువ డోర్లను పెడుతూ ఉంటారు. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది దోషంగా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో తలెత్తే సమస్యలకు ఇది కారణం కావచ్చు. కాబట్టి వెంటనే ఇంట్లో ఎక్కువగా ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తీసి వెయయ్యండి.
కిటికీల విషయంలో ఇది పాటించండి:
ఇంటి వాస్తులో భాగంగా కిటికీలు ఎంతో కీలకం అని గుర్తించుకోండి. కాబట్టి ఇంటి నిర్మాణ సమయంలో వాస్తు ప్రకారం పెద్ద కిటికీలను, గాలి మరియు వెలుతురు ఇంట్లోకి ధారాళంగా వచ్చేలా చూసుకోండి. ఇలా గాలి, వెలుతురు ఉంటే ఇంట్లో చాలా వరకు సమస్యలకు ఆస్కారం ఉండదట.
బెడ్ రూం ఎంతో కీలకం:
మనం నిద్రపోవడానికి వాడే బెడ్ రూం అనేది వాస్తు పరంగా ఎంతో కీలకం అని గుర్తించుకోండి. బెడ్ రూంని ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద, బీమ్ లేదా పిల్లర్ కింద, వాష్ రూం కింద ఉండకూదని వాస్తులో వివరించబడింది. కాబట్టి బెడ్ రూం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలని గుర్తించుకోండి.
Vastu Tips: అద్దాలతో జాగ్రత్త:
ఇంట్లో డిజైన్ పేరుతో ఎక్కువ అద్దాలను పెట్టుకోవద్దు. ఇంటీరియర్ డిజైన్ కోసం అంటూ అద్దాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే మానుకోండి. ఒకవేళ ఇప్పటికే ఎక్కువ అద్దాలను ఏర్పాటు చేసి ఉంటే వాటిని వెంటనే తొలగించండి. అద్దాలు నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతాయి. కాబట్టి వాటిని తక్కువ ఉంచుకుంటే మంచిది. అద్దాలు ఒక దానికి ఒక ఎదురెదురుగా ఉండకూడదని గుర్తించుకోండి.