Vastu Tips: మనలో చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇంటి విషయంలో వాస్తు అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. ఇల్లు వాస్తు ప్రకారం లేకపోతే.. ఇంటిలోని వారు రకరకాల సమస్యలతో బాధపడతారు. వాస్తు దోషాలను నివారించడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కొంతమంది కొన్ని రకాల బొమ్మలను పెడుతుంటారు.
ఇంట్లోని వాస్తు దోషాలను నివారించడానికి ఒంటె విగ్రహాలను పెట్టుకుంటే సరిపోతుంది. ఒంటె అనేది కష్టమైన పరిస్థితుల్లో కూడా అవిశ్రాంతంగా పని చేస్తుంది. కాబట్టి ఇది శ్రమజీవిగా పరిగణించబడుతుంది. దీనినిన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోయి, ఇంటికి, ఇంట్లోని వాళ్లకు మేలు కలుగుతుంది.
ఇంట్లో ఒంటెల విగ్రహాలను ఉంచడం వల్ల చేసే పనిలో విజయం లభిస్తుందని, డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని వాస్తులో వివరించడం జరిగింది. అయితే ఒంటె విగ్రహాలను ఎక్కడ పెడతామన్నది కూడా వాస్తులో ఎంతో కీలకం. వాస్తు ప్రకారం ఒంటె విగ్రహాలను ఇంట్లోని డ్రాయింగ్ రూం లేదంటే లివింగ్ రూంలోని వాయువ్య దిశలో ఉంచాలని వాస్తు చెబుతోంది. ఈ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి.. మేలు కలుగుతుందట.
Vastu Tips :
ఇంట్లో రెండు ఒంటె విగ్రహాలను ఉంచడం వల్ల ఇంటికి సంపద ఆకర్షించబడుతుందట. ఇంట్లో నిత్యం డబ్బులు ఉండేలా, సరిసంపదలను ఈ రెండు ఒంటె విగ్రహాలు ఆకర్షిస్తాయట. చైనీస్ మరియు జపనీస్ వాస్తు అయిన ఫెంగ్ షుయ్ ప్రకారం కూడా ఒంటె విగ్రహాలు వ్యాపార ఇబ్బందులను, ఆర్థిక అడ్డంకులను తొలగిస్తాయి. కాబట్టి ఇంట్లో లేదంటే వ్యాపార స్థలంలో ఒంటె విగ్రహాలను ఏర్పాటు చేసుకొని, అన్ని రకాల వాస్తుదోషాలను నివారించడంతో పాటు సానుకూల ఫలితాలను పొందండి.