Vastu Tips For House: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి ఆత్మగౌవర ప్రతీక. అందుకే జీవితంలో సొంత ఇల్లు కొనడం లేదా కట్టాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఇల్లు ఉండే ప్రాంతం, రవాణా సదుపాయాలతోపాటు వాస్తు కూడా చూడటం ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. ఇంటి వెలుపల ఉన్న వాస్తు దోషం ఇంట్లో నివసించే సభ్యుల జీవితాల్లో సమస్యలను సృష్టిస్తుందట. వారి పురోగతిని అడ్డుకుంటుంది. కాబట్టి, మీరు ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు, మీరు దాని చుట్టూ ఉన్న వాస్తుపై కూడా శ్రద్ధ వహించాలి. ఏయే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇంటి దగ్గర మతపరమైన స్థలం
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి సమీపంలో మతపరమైన స్థలం ఉంటే దాని శక్తి సానుకూలత ఎక్కువగా ఉంటుంది. అయితే మనుషులపై మాత్రం ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందట. మతపరమైన ప్రదేశంలో నివసించేటప్పుడు ఒక వ్యక్తి జీవితం ఒత్తిడిగా ఉంటుందట. అందుకు కాస్త దూరంగా ఇల్లు తీసుకోవడం ఉత్తమం.
ఆస్పత్రి వద్ద ఇల్లు వద్దు..
ఆసుపత్రి చుట్టుపక్కల లేదా ఇంటి ముందు ఉండకూడదు. ఎందుకంటే, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతారు కాబట్టి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆసుపత్రి పరిసర ప్రాంతాల ప్రజలు ప్రశాంత జీవనం గడపలేకపోతున్నారు. అందుకే ఆస్పత్రి అందుబాటులో ఉంటూనే.. కాస్త దూరంగా ఇల్లు కట్టుకోవాలి.
Vastu Tips For House: పాత భవనాల వద్ద కొత్త ఇల్లు తీసుకోవద్దు..
పాత భవనాలు ఎక్కువగా ఉన్న చోట కొత్త ఇల్లు తీసుకోవడం మంచిది కాదు. అలాంటి ప్రదేశంలో ప్రతికూల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మూడు వీధులు లేదా మూడు రోడ్లు కలిసే చోట ఇల్లు శుభప్రదంగా పరిగణించబడదు.