Vastu Tips: ధనం ఏ మనిషినైనా నడిపించే ఇంధనం ఇది ఒక పాపులర్ సినిమాలో డైలాగ్. ఇది నిజ జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. డబ్బు లేకుండా మనం ఏమీ చేయలేం. కొంతమందికి డబ్బు అవసరాలను తీరిస్తే,మరి కొంత మంది డబ్బుని ఒక విలాసంగా చూస్తారు. డబ్బుని ఎలాగైనా వినియోగించవచ్చు కానీ డబ్బు అందరికీ అవసరం. డబ్బు అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు.
కష్టపడకపోతే డబ్బు రాదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు ఇంట్లో నిలువ ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. కొన్ని అలవాట్లు అలవరచుకోవడం వల్ల ధనలక్ష్మి ఇంట నిలుస్తుంది అంటున్నారు నిపుణులు. ధన యోగం మెరుగుపడాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలా మందికి మంచం మీద కూర్చుని అన్నం తినడం అలవాటు. ఇదే మంచిది కాదంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ఆరోగ్యానికి చేటు చేయడం మాత్రమే కాదు,ఒక దోషం కూడా. దోషం మంచిది కాదు.వంట గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంగిలి పాత్రలు వంటగదిలో ఉండరాదు. పాత్రలు ఇలా ఉండడం వల్ల లక్ష్మీ దేవి కోపం చూడవలసివస్తుంది. లక్ష్మీ దేవి ధనానికి అధిపతి. శాస్త్రం ప్రకారం ఆమె కటాక్షం లేకపోతే మనం ఏమీ చేయలేము. అమ్మ వారి కటాక్షం పొందడమే కాదు,అమ్మవారికి కోపం కూడా తెప్పించకూడదు.
Vastu Tips:
ఇరుగూ పొరుగూ అన్న తరువాత అవి కావాలి ఇవి కావాలి అని వస్తూ ఉండటం సహజం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత కొన్ని వస్తువులు ఇవ్వడం మంచిది కాదు. పెరుగు,ఊరగాయ,ఉప్పు,పాలు ఎవరికీ ఇవ్వకూడదు. పక్కవారికి ఈ పదార్థాలు ఇచ్చే ముందు ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది.బాత్రూంలో ఖాళీ బకెట్లు ఉంచడం కూడా మంచి కాదు అంటున్నారు నిపుణులు.