vastu tips: జీవితంలో ప్రశాంతమైన నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. పగలంతా కష్టపడి పని చేసిన వారికి రాత్రిపూట నిద్ర పట్టకపోవడం అనేది చాలా ఇబ్బందికర సమస్యగా మారుతుంది. ఇలాంటి తరుణంలో ఏ పనీ చేయలేకపోతారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అర్ధరాత్రి మెలకువ వచ్చి ఇక నిద్ర పట్టకపోవడం అనే సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలున్నాయిని నిపుణులు చెబుతున్నారు.
సరిగా నిద్ర పట్టని వారికి కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో నిద్ర పోయే ముందు చిన్న పద్ధతులను పాటించడం ద్వారా నిద్రాభంగాల నుంచి బయట పడొచ్చని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రకుపక్రమించే ముందు ఏ దిశలో తల పెట్టి పడుకుంటున్నారనేది చూసుకోవాలంటున్నారు. పొరపాటున కూడా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదని సూచిస్తున్నారు
ఇక ప్రతి రోజూ పీడకలలు పీడిస్తుంటే నిద్రపోయే ముందు గదిలో నాలుగు మూలల్లో కాస్త రాతి ఉప్పును పోస్తే గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రశాంతమైన నిద్ర వస్తుందంటున్నారు. దాంతోపాటు ఒక చెంబుడు నీటిని తీసుకొని, మంచం పక్కన మూలన పెట్టి తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలని సూచిస్తున్నారు. గదిలో నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే నీరు తనలోకి తీసుకుంటుందని సూచిస్తున్నారు.
vastu tips: పీడకలలు మరీ ఎక్కువైతే ఇలా చేయండి..
ఇలా చేయడం వల్ల ప్రతి కూల ఎనర్జీని పారదోలిన వారమవుతామని చెబుతున్నారు. పీడ కలలు మరీ ఎక్కువగా వస్తుంటే.. నిద్రకు వెళ్లే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోవాలని చెబుతున్నారు. దాంతో పాటు పడుకునేముందు గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రం చేసుకోవాలని, కర్పూరం కలిపిన కొబ్బరినూనెను పాదాలకు పూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. దిండు కింద ఇనుప కత్తి పెట్టుకున్నా పీడకలలు దూరమవుతాయని చెబుతున్నారు.