vastu tips: రోజంతా కష్టపడి రాత్రి నిద్రకు ఉపక్రమించేటప్పుడు నిద్రలేమి సమస్య చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. సరిగా నిద్ర పట్టక అనారోగ్యం బారిన పడుతుంటారు. రాత్రి అయ్యిందంటే చాలా మందికి ఇదే భయం. విపరీతమైన ఆలోచనలు, ఆందోళనతో నిద్ర పట్టక సతమతమవుతుంటారు. ఒకవేళ నిద్ర పట్టినా గంటా రెండు గంటల్లోనే మళ్లీ మెలకువ రావడం జరుగుతూ ఉంటాయి. తర్వా తనిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు.
ఇలాంటి నేపథ్యం ఉన్న వారి కోసం వాస్తు శాస్త్రంలో పలు సూచనలు చేస్తున్నారు నిపుణులు. రాత్రి వేళలల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చని చెబుతున్నారు. నిద్రపోయే ముందు బెడ్ రూమ్ లో ఏ దిశలో తల పెట్టుకొని పడుకుంటామనేది పరిశీలించుకోవాలి. పొరపాటున కూడా ఉత్తర దిశకు తల పెట్టి నిద్రించకూడదని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పూట పీడకలలు వేధిస్తుంటే నాలుగు మూలల్లో కాస్త రాళ్ల ఉప్పును పోయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందట. ప్రశాంత నిద్రకు మార్గం సులువవుతుందని చెబుతున్నారు. ఓ చెంబులో నీళ్లు తీసుకొని మంచం పక్కన ఓ మూలకు పెట్టి తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందట. ప్రతికూల ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పడుతుంది.
vastu tips: భగవన్నామ స్మరణ ముఖ్యం..
పీడ కలలతో బాధపడుతున్న వారు వాస్తు నియమాలతో పాటు నిద్రకు ఉపక్రమించే ముందు భగవంతుని ధ్యానించాలని సూచిస్తున్నారు. రాత్రిపూట ఆందోళన కలిగించే సినిమాలు, వెబ్ సిరీస్ లు, హార్రర్ మూవీలు, సీరియల్స్ చూడటం మానేయాలి. నిద్రపోయే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోవడం ద్వారా ప్రశాంత నిద్ర వస్తుందట. అలాగే దిండు కింద ఇనుప వస్తువు కూడా పెట్టుకోవచ్చు. మహిళలైతే జుట్టును విరబోసుకోకుండా జడతోనే నిద్రించడం మంచిది.