Vastu Tips: వాస్తు అంటే మూఢ నమ్మకం కాదు అది ఒక సైన్స్. దీన్ని మంచిగా ఆచరించగలిగితే అదృష్టం కలిగి సిరి సంపదలు మన ఇంటనే ఉంటాయి. 5 చిట్కాలు పాటిస్తే అదృష్టం మీదే. ఈ ఐదు చిట్కాలు అంత కష్టం ఏమీ కావు. సులభంగా ఎవరైనా పాటించగలిగేవి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం పాటించవలసిన 5 సూత్రాలు..
ఆకుపచ్చ మొక్కలు ఆరోగ్యానికి మంచిదంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం మొక్కలు ఆగ్నేయ మూల ఉంచాలి. అలా చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. ఇక ఇంట్లో ఉండే ఫర్నీచర్ కూడా ముఖ్యమే.గుండ్రంగా ఉండే ఫర్నీచర్ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండరాదు.
దాదాపు అందరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది.ఉదయం లేవడంతోనే తులసికి నీళ్ళు పోస్తాం. కానీ వాస్తుశాస్త్రం చెబుతోంది ఏంటంటే గురువారం నాడు నీళ్ళతో పాటుగా పాలు కూడా తులసి చెట్టుకి ఇవ్వాలి. ప్రతి గురువారం ఇలా చేస్తే మనకున్న అరిష్టాలు అన్నీ తొలగిపోతాయి.
Vastu Tips:
గురువులు మనకి పూజ్యులు. కాబట్టి వారి ఆశీర్వాదం మనకి కావాలి. అలా జరగాలి అంటే వాళ్ళ ఫోటోలు లివింగ్ రూమ్లో ఉంచాలి. అలాగే భార్యా భర్తలు ఉండే బెడ్ రూమ్ లో విడి విడి మంచాలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వారి మధ్య దూరం పెరుగుతుందని అంటారు. అదృష్టం ఇంట్లో ఉండాలంటే నెగటివ్ ఎనర్జీ అసలు ఉండకూడదు. ఇలా జరగాలి అంటే కర్పూరంతో హారతి ఇవ్వాలి. కనీసం వారంలో ఒకసారి అయినా ఇలా చేయాలి. వంట చేసేటప్పుడు కూడా ఒక చిట్కా పాటించాలి. అదేంటంటే,పెనం మీద రొట్టె కాల్చడానికి ముందు కొద్దిగా పాలు చల్లాలి. ఇది మనలో చాలామందికి అలవాటు. ఆరోగ్యం దృష్ట్యానే కాదు వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఇలా చేస్తే మంచిది.