Vastu ఈ మధ్య కాలంలో ఇల్లు కట్టే ముందు ఖచ్చితంగా వాస్తు శాస్త్రం చూడనిదే అసలు ఏ పని ముట్టడం లేదు. ఇల్లుని ఏ సమయంలో మొదలు పెట్టాలి. ఎక్కడ ఏ తలుపులని ఉంచాలి. ఇంటికి ఎన్ని తలుపులని ఉంచాలి. ఇవి అన్నీ సరైన పద్ధతి ప్రకారం చేయకపోతే ఇంట్లో ఉన్న వారిలో దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఇల్లు కట్టే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోక తప్పదు. అయితే ఏ ఇంటికైనా ముఖ ద్వారం అనేది చాలా ముఖ్యం. ఏ పనిని ప్రారంభించినా ముఖ ద్వారం నుంచే ప్రారంభిస్తారు. అలాంటి ముఖ ద్వారం ఏ వైపు ఉండాలో తెలుసుకోకపొతే లేని పోనీ చిక్కులు తెచ్చుకున్నట్టే. అయితే ముఖ ద్వారం ఉత్తరం వైపు గానీ పశ్చిమం వైపుకు గానీ ఉండాలి. తూర్పు వైపు ఉన్నా మంచిదే. ఇలా ఈ మూడు దిక్కుల్లో ఏ వైపు ఉన్నా ఇంట్లో ఎలాంటి చికాకులు లేకుండా సంతోషంగా ఉంటారు.
అలాగే ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఒక వేళ దక్షిణం వైపు ఉంటే మాత్రం వాస్తు పిరమిడ్ ని ముఖ ద్వారం దగ్గర పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
Vastu
అయితే ద్వారాలకు పసుపు వంటివి రాస్తూనే ఉంటాం కదా. ఇది కూడా వాస్తు శాస్త్రంలో ఒక భాగమే. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. ఒక వేళ ముఖ ద్వారం వద్ద విరిగి పోయిన వస్తువులు కానీ, కుర్చీలు కానీ డస్ట్ బిన్లు కానీ ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో నెగెటివిటీ పెరుగుతుంది. ఇక ముఖ ద్వారానికి ఓంకారం మరియు స్వస్తిక్ వంటి గుర్తులు ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడు చికాకులు లేకుండా ఆనందంగా ఉంటారు.