Vastu Shastra: ఉదయాన్నే ఎవడి మొహం చూసానో ఏమో.. ఈ రోజంతా దరిద్రం నా వెంబటే ఉంది. సాధారణంగా మనం అనుకునే మాట. అయితే నిజంగానే మనం ఉదయం లేవగానే చూసే మొహాలు గానీ, వస్తువులు గానీ మనపై ప్రభావం చూపిస్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని వాస్తు నిపుణులు, శాస్త్రం తెలిసిన వారు చెబుతున్నారు. చాలా మంది ప్రొద్దున లేచి అద్దంలో మొహం చూసుకోవడం, జుట్టు దువ్వడం, పాచి పని చేయడం చేస్తారు. కానీ అది మంచిది కాదని వాస్తు విజ్ఞులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రొద్దున లేవగానే ఎలాంటివి చూస్తే, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకోసం..
మన హిందూ సంప్రదాయంలో ఉదయం సమయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెబుతుంది. అయితే ఉదయం లేవగానే కొన్ని చూడడం వల్ల చెడు ఫలితాలు పొందుతాము. ఉదయాన్నే లేచి జంతువులు, పక్షుల చిత్రాలను చూడడం చెడుకు సంకేతమని నిపుణుల మాట. అలా చేస్తే రోజంతా చెడు జరగడం లేదా, ఇతరులతో వివాదాలు వంటివి జరుగుతాయట.
ఆగిపోయిన లేదా పనిచేయని గడియారం వైపు అస్సలు చూడవద్దు. ఇది చెడు కాలానికి సంకేతం. అందుకే అసలు ఆగిపోయిన/ పనిచేయని గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు, పడేయాలి. అలా ఇంట్లో ఉంటె ఉదయం సహజంగా టైమ్ చూస్తాము. అప్పుడు అది మనకు మంచిది కాదు. ఉదయం లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం అరిష్టం. ఆర్థిక నష్టం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వంటి వాటిని ఇది పెంచుతుంది. ముందుగా ముఖం కడుక్కోవడం లేదా స్నానం చేసి ఆ తరువాత అద్దంలో ముఖం చూసుకోవాలి.
Vastu Shastra
ఇక ఆడవాళ్లు లేవగానే ముందు పాచి పని చేయడానికి వెళ్తారు. అయితే లేచిన వెంటనే పాచి గిన్నెలను చూస్తే అవి దారిద్య్రాన్ని కలిగిస్తాయి. అందుకే రాత్రి పాత్రలను రాత్రే కడిగి వేయాలని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి రాత్రి గిన్నెలను ప్రొద్దున వరకు ఉంచకూడదు. వాటిని రాత్రే శుభ్రం చేయాలి. అందుకే శాస్త్రం తెలిసిన వారు సూచించిన విధంగా ఉదయం లేవగానే ఇలాంటి పనులు చేయకండి. అవి నెగెటివ్ ఫలితాలు కలిగించవచ్చు.