Vastu fot kitchen: వంటగదిలోని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెడతారు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. వస్తువులు, పాత్రలను ఎలా పడితే అలా పారేస్తూ ఉంటారు. కానీ వంటగదికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి..? గ్యాస్ స్టవ్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి..? కిచెన్ ఎక్కడ పెట్టుకోవాలి? కిచెన్ ఎప్పుడు క్లీన్ చేయాలి? లాంటి అనేక విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
గ్యాస్ స్టాండ్‌పై పండ్లు ,కూరగాయల ఫొటోలను పెట్టుకుంటే మంచిదని వాస్తు పండితులు చెబున్నారు. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ద్వారాఇంట్లో వారికి శుభం జరుగుతుందని చెబుతున్నారు. ఇక కీటకాలు, సాలెపురుగులు, బొద్దింకలు, ఎలుకలు లాంటి కిచెన్ లోకి వస్తే జీవితంలో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ట్యాప్ నుండి నీళ్లు లీక్ అయితే ఇంటికి మంచికాదని, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
గురువారం మినహా మిగతా రోజుల్లో వారానికి ఒక రోజు పాత్రలను, కిచెన్ ను సముద్రపు ఉప్పుతో తుడిస్తే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక కిచెన్ లో ఇనుము, స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదని ఇత్తడి, రాగి, వెండి, కంచు పాత్రలు ఉపయోగిస్తే మంచిదని అంటున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లు ఉపయోగించడం అసలు మంచిదని కాదని, దాని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని అంటున్నారు.
Vastu fot kitchen:
ఇక ఆహారం తీసుకున్న తర్వాత తిన్న ప్లేట్ ను గ్యాస్ స్టవ్ పై పెట్టడం అసలు మంచిది కాదని, దాని వల్ల సమస్యలు తలెత్తుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ప్లేట్ లో చేయి కడుక్కోవడం మంచిదని కాదని, సింక్ లోనే కడుక్కోవాలని చెబుతున్నారు.