Vastu: “విద్య అంటే జ్ఞానం సంపాదించటం, జ్ఞానం రెండు విధాలు. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ, ఈ రెండు రకాల జ్ఞానమూ విద్య ద్వారా లభ్యం కావాలి” విద్య లేని వాడు వింత పశువు ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లలు చదువుకోవాలని ఎన్ని వసతులు కల్పించినా చదువులో రాణించలేక పోతున్నారని బాధపడుతుంటారు. మీ బిడ్డ చదువులో నిమగ్నమై ఉండక, నిరంతరం వెనుకబడి ఉంటే, మీరు వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలి. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ప్రతికూలత పెరుగుతుంది. అప్పుడు పిల్లలకు మనస్సు ఏకాగ్రత సాధించబడదు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరగడం మొదలవుతుంది.వాస్తు శాస్త్రంలో ఇటువంటి సమస్యలకు కొన్ని చిట్కాలు ప్రస్తావించబడ్డాయి తెలుసుకోండి.
స్టడీ రూమ్ లో ఉండాల్సినవి, ఉండకూడనివి ఇవే :
స్టడీ టేబుల్ ఆకారం దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. స్టడీ టేబుల్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలని గుర్తుంచుకోండి. అంతేకాదు పిల్లల స్టడీ రూమ్ లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచకుండా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగం వల్ల పిల్లలు చదువుకు దూరం అవుతారు. టీవీ, వీడియో గేమ్‌లు, సీడీ ప్లేయర్‌లు వంటి వాటిని స్టడీ రూమ్‌లో ఉంచకూడదు.అంతేకాదు వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలు చదువుకునే గదిలో కొవ్వొత్తులు పెట్టాలి. దీంతో వారి మనసు చదువుల వైపు మళ్లుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పిల్లల గదిలో తూర్పు, ఉత్తరం లేదా దక్షిణ భాగంలో కొవ్వొత్తి వెలిగించడం ద్వారా పిల్లలు చదువుపై ఆసక్తి చూపుతారు. వారి మనసు చదువులకే అంకితం అవుతుందని నమ్ముతారు. అదే సమయంలో, మేధో సామర్థ్యం పెరుగుతుంది.
స్టడీ రూమ్స్ కు వెయ్యాల్సిన రంగులివే:
పిల్లల గదులకు వాస్తుశాస్త్రం ప్రకారం ఆకుపచ్చ మరియు నీలం రంగులు వేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ పిల్లల గదిలో ఎరుపురంగును ఉపయోగించకూడదు. ఇక స్టడీ టేబుల్ కు ఎదురుగా నేరుగా విండో ఉండకూడదు. చిందరవందరగా మురికిగా ఉన్న గదులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. కాబట్టి చిన్నారులు చదువుకునే స్టడీ రూమ్స్ ఎప్పుడు నీట్ గా పెట్టుకోవాలి. శుభ్రమైన గది, పుస్తకాలన్నీ నీట్ గా సర్ది, ఒక క్రమపద్ధతిలో ఉండాలి. అప్పుడే విద్యార్థికి కూడా క్రమబద్ధమైన జీవితం అలవాటు అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే పిల్లలకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
Vastu: చదువుకోవడానికి ఈ దిశలే అనుకూలం :
వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం చదువుకోవడానికి అనువైన దిశ ఈశాన్యదిశ. ఈశాన్య దిశలో కూర్చుని గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో చిన్నారులు చదువుకున్నప్పుడు వారికి ఆ చదువు వంట పడుతుంది. చదువుకోవడానికి తూర్పు లేదా ఈశాన్య దిశ, ఉత్తరదిశలు అనుకూలమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం చీకటి గదిలో, లేదా పదునైన వెలుతురు ఉన్న గదిలో, డిమ్ వెలుతురు ఉన్న గదిలో చదువుకోవడం వల్ల వారికి చదివింది అర్థం కాదు. ఎంత చదివిన వారు దానిని గుర్తుంచుకోవటంలో విఫలమవుతారు. అందుకే చిన్నారులు చక్కగా చదువుకోవాలంటే గాలి,వెలుతురు ధారాళంగా వచ్చే గదిని వారికోసం ఏర్పాటు చేసుకోవాలి.