Vastu: మనిషి జీవితాన్ని సులభతరం చేయడానికి వాస్తు ఉద్దేశించబడింది. అందుకే వాస్తు ప్రకారం ఉండే ఇంటిలో అంతా ప్రశాంతంగా ఉంటుంది. అయితే చాలామంది వాస్తు విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి తప్పుల వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు మీ ఇంటి పరిసరాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముళ్ల మొక్కలు ఉంచరాదు:
ఇంటి ఆవరణలో ఇళ్ల మొక్కలను అస్సలు ఉంచుకోకూడదని వాస్తు చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు ముళ్ల మొక్కలను నాటకూడదని.. అలా చేస్తే ఇంట్లోని వాళ్లకు ప్రశాంతత ఉండదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలంకరణ కోసం అయినా సరే ముళ్లు ఉంటే మొక్కలను అస్సలు ఇంటి ఆవరణలో పెంచుకోకూడదని వాస్తు చెబుతోంది.
చెత్తను నిల్వ చేయనివ్వకండి:
ఇంటి ఆవరణలో ఎలాంటి చెత్తను నిల్వ చేయకూడదని వాస్తు చెబుతోంది. చెత్తను ఇంట్లోనే కాకుండా ఇంటి ఆవరణలో కూడా నిల్వ చేయకూడదని.. ఇలా కాకుండా ఇంటి ఆవరణలో చెత్త, బూజు ఉంటే మాత్రం లక్ష్మీదేవి కటాక్షం ఉండదట. అలాగే దురదృష్టం, అనారోగ్య సమస్యలు లాంటివి కూడా వస్తాయట. కాబట్టి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ముగ్గులు వేసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయట.
ఇంటి ద్వారం ఉండే ఎత్తు:
వాస్తు ప్రకారం ఇంటి ద్వారం అనేది ఇంటి, ఇంట్లో వాళ్ల స్థితిని మారుస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఖచ్చితంగా ఎదురుగా ఉండే రోడ్డు కన్నా ఎత్తులో ఉండాలని వాస్తులో వివరించబడింది. ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారం రోడ్డు కన్నా తక్కువ ఎత్తులో ఉంటే మాత్రం ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని.. దీని వల్ల నష్టం తప్పదని వాస్తులో పేర్కొనబడింది.
Vastu: ఇంటి ముందు రాళ్లు ఉండనివ్వకండి:
చాలామంది అందం కోసమో లేదంటే తెలియకనో ఇంటి ముందు రాళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం కోసం వాడే మార్బుల్స్ కానీ ఇటుకలు కానీ రాళ్లు కానీ ఏవీ కూడా ఇంటి ముందు అస్సలు ఉంచుకోకూడదని వాస్తు చెబుతోంది.