Vasthu Shastra: ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. బంధువులు, స్నేహితుల ఇళ్ల కంటే తమ ఇల్లు చూడటానికి సుందరగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఒక్కో గదిని ఒక్కో విధంగా మార్చుకుంటారు. అయితే ఇంట్లో మాత్రం హాల్ అన్ని రూమ్స్ కంటే ప్రత్యేకమని చెప్పాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కూర్చోవడం, మాట్లాడటం, భోజనం చేయడం లాంటివి హాలులోనే చేస్తారు. కాబట్టి అన్ని గదులు కంటే హాలును మరింత అందంగా కనిపించేలా చేసేందుకు అందరూ ప్రయత్నిస్తారు.
గృహాలంకరణను నిర్లక్ష్యం చేయొద్దు
హాల్‌ను అందంగా తీర్చిదిద్దే క్రమంలో ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని అందించే చిత్రపటాలు.. ప్రకృతి చిత్రాలు, మహోన్నతులు పెడుతుంటారు. అలాగే రుషులు, శాస్త్రవేత్తలు, స్వాతంత్ర్య సమరయోధులు, అమ్మానాన్నల ఫొటోలు కూడా హాల్ లోని గోడలపై అలంకరిస్తారు. అయితే ఇవన్నీ మన కుటుంబ సభ్యులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. కాబట్టి సింహాలు, పులులు లాంటి వాటిని కూడా పెడితే బాగుంటుంది. గృహాలంకరణ.. శాస్త్రంలో ఒక భాగమని గుర్తుంచుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
ఇది నమ్మకం మాత్రమే.. శాస్త్రం కాదు!
కాలాలకు అతీతంగా కొన్ని నమ్మకాలు ప్రజల మనసుల్లో బలంగా ఉండిపోతాయి. కానీ అన్ని నమ్మకాలను కలకాలం కాపాడుకోవాల్సిన అవసరం లేదు. కాలం గడిచేకొద్దీ వచ్చే మార్పులకు అనుగుణంగా కొన్నింటిని వదిలేయాలి. మనం ఎక్కడికైనా ప్రయాణిస్తున్న సమయంలో రైల్వే వంతెన వస్తే.. అక్కడ జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా రైలు వెళ్తుంటే.. అది వెళ్లే వరకూ ఆగి, ముందుకు వెళ్తాం. కానీ ఇందులో జాగ్రత్త ఉంది.
Vasthu Shastra:
పాత వంతెన ఏమవుతుందోనని.. అలాగే ట్రెయిన్‌లో నుంచి వ్యర్థాలు పడతాయేమోనని జాగ్రత్త పడటం. నిచ్చెన కింద నుంచి కూడా ఇదే వర్తిస్తుంది. ఎవరైనా దిగుతారేమోననేది జాగ్రత్త మాత్రమే. నేడు ఎన్నో వంతెనలు, ఫ్లై ఓవర్లు దాటిపోతేనే కానీ, ముందుకు సాగలేం. దేని కింద నుంచైనా జాగ్రత్తగా దాటడం అవసరమే. కానీ దాటిపోవడం దోషం మాత్రం కాదు. పూర్వకాలంలో మట్టి, చెక్కలతో మిద్దెలు వేసేవారు. రాళ్లతో, కర్రలతో వంతెనలు కట్టేవారు. వాటి నాణ్యతపై అందరిలో అపనమ్మకం ఉండేది. ఆ భావాల పరంపర ఇప్పటికీ మనల్ని వెంటాడుతోంది. అంతేగానీ.. అవన్నీ శాస్ర్తాలు కావనేది అర్థం చేసుకోవాలి.