Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటి వారం నుండి కాస్త సైలెంట్ గానే సాగుతోందని అని చెప్పడం లో ఏ మాత్రం సందేహం లేదు. గత ఐదు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ మరీ తక్కువ వినోదాత్మకంగా సాగుతోంది. వినోదం పంచడం ఏమోగాని హౌస్ లో పులిహోర కలపడం కోసం అర్జున్ పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. మొదటి వారం నుండి ఇప్పటి వరకు తగ్గేదేలా అన్నట్లు శ్రీసత్యను ప్రసన్నం చేసుకునేందుకు అర్జున్ ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే..!
ఆట ఆటడం మానేసి పూర్తిగా శ్రీ సత్య మాయలో పడిపోయాడు. ఎప్పుడెప్పుడు ఆమె తన ప్రేమను ఒప్పుకుంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అయితే అలాంటి పప్పులు తన దగ్గర ఉడకవు అని శ్రీ సత్య ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్న.. అర్జున్ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. అనవసరంగా ఆమె చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా.. గేమ్ పై కూడా కాన్సెంట్రేట్ చేయట్లేదు.

టైటిల్ కొడతా.. నేనేంటో చూపిస్తా అంటూ బిగ్ బాస్ షో మొదలైనప్పుడు ఎన్నో గొప్పలు చెప్పాడు అర్జున్ కళ్యాణ్. కానీ ఆయన ఆటతీరు చూస్తుంటే మాత్రం ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదు. కేవలం శ్రీ సత్యని ట్రై చేయడానికి మాత్రమే ఆయన ఇంటికి వచ్చినట్టు అర్థం అవుతుంది. ఇది నిజం అని మరోసారి హౌస్ లో నిరూపితం అయింది. హౌస్ లో శ్రీహాన్, రేవంత్, వాసంతి ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలో షూటింగ్స్ లో ఉన్నపుడు తనకు శ్రీసత్య అంటే ఇష్టమని అర్జున్ ఓసారి చెప్పాడని వాసంతి ఓ షాకింగ్ విషయం బయటపెడుతుంది. అంటే అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుండే శ్రీసత్యను ట్రై చేస్తున్నాడని వాసంతి చెప్పిన మాటలతో అర్ధమై పోతుంది. ఈ విషయం చెప్పినప్పుడు అక్కడ అర్జున్ కూడా ఉంటాడు. ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవసరమా అని అర్జున్ వాసంతిని అంటాడు. ఏది ఏమైనా ఈ పులిహోర యవ్వారం ఇంకా ఎంత వరకు సాగుతుందో చూడాలి..!.