బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసి ఎలిమినేట్ అయిన వాసంతి కృష్ణన్ తన అందంతో ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ బిగ్ బాస్ కి ముందు వాసంతి ఒక సీరియల్ లో నటించింది. అలాగే రెండు చిన్న సినిమాలలో నటించింది. అయితే ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనే అవకాశం ఈ అమ్మడుకి వచ్చింది. హౌస్ లో పెద్దగా గేమ్ ఆడకపోయిన ఏకంగా ఆరువారాల పాటు కొనసాగింది. ఆరంభంలోనే ఎలిమినేట్ అయిపోతుందని అందరూ భావించారు. అయితే వాసంతి కృష్ణన్ కంటే స్ట్రాంగ్ కంటిస్టెంట్ లు అందరూ ముందుగానే బయటకి వచ్చేసారు.
కానీ ఈ బ్యూటీ మాత్రం ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ ని అంటిపెట్టుకొని ఉంది. ఇక ఈ షోద్వారా తాను కోరుకున్న గుర్తింపుని వాసంతి బాగానే సొంతం చేసుకుంది. ఇదే హైప్ తో కాస్తా గ్లామర్ షో చేసి సినిమాలలో ఆఫర్స్ సొంతం చేసుకోవాలని ఈ అమ్మడు భావిస్తుంది. కచ్చితంగా కెరియర్ స్పీడ్ అప్ అవుతుందని అనుకుంటుంది. అయితే అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చింది.
పవర్ స్టార్ తో సినిమాలో ఛాన్స్ వస్తే ఇక ఏం ఆలోచించకుండా ఒకే చెప్పేస్తానని చెప్పింది. అలాగే తన ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని గతంలోనే చెప్పింది. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిన వదులుకోనని చెప్పింది. మా నాన్న గతంలో ప్రజారాజ్యం పార్టీలో లీడర్ గా ఉండేవారని, ఇప్పుడు జనసేన మద్దతురారుడిగా ఉన్నారని చెప్పింది. ఈ నేపధ్యంలో రాజకీయాల మధ్య తనకి ఆసక్తి ఉందని వాసంతి చెప్పడం విశేషం. ఒకవేళ జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని చెప్పడం విశేషం.