ఈ మధ్య టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. పోకిరి సినిమా 4కె రీరిలీజ్ తర్వాత ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. రీరిలీజ్ లో స్టార్ హీరోల చిత్రాలు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కొన్ని సెలక్టడ్ థియేటర్స్ లో సినిమాని ఒక్క రోజు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. పోకిరి తర్వాత జల్సా రీరిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి మూడు కోట్ల వరకు కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది. దాని తర్వాత ఖుషి మూవీ రీరిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే కృష్ణ సింహాసనం మూవీని 4కె వెర్షన్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
అలాగే రీసెంట్ గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ అయ్యి గట్టిగానే సందడి చేసింది. ఎన్ఠీఆర్ ఆది సినిమాని కూడా రీరిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇలా 15 ఏళ్ళు దాటిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలని మరోసారి తెరపై ప్రదర్శించి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వర్షం సినిమాని కూడా రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని 4కె వెర్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు.
ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న ఫేమ్ బట్టి నార్త్ ఇండియాలో కూడా సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనికోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో వర్షం మూవీ బెస్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత అతనికి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలోనే 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రభాస్ వర్షం తెరపై ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఇక ఈ వర్షం రీరిలీజ్ సమయంలో ఆదిపురుష్ టీజర్ ని కూడా థియేటర్స్ లో ప్రదర్శించాలని భావిస్తున్నారు.