Varsha Bollamma : ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ.. ఇటు హీరోయిన్‌గానూ రాణించిన నటీమణుల్లో వర్ష బొల్లమ్మ ఒకరు. అమ్మడికి అందంతో పాటు అభినయం కూడా తోడవడంతో అవకాశాలు బాగానే తలుపుతట్టాయి. అయినా కూడా ఎందుకోగానీ అమ్మడు స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఓ బడా నిర్మాతకు కోడలిగా వెళ్లబోతోందట ఈ బ్యూటీ. అమ్మడి అందానికి ఓ బడా నిర్మాత కొడుకు ఫిదా అయిపోయాడట. ఇదే విషయాన్ని తన ఇంట్లో కూడా చెప్పేశాడట.
కొడుకు అభిప్రాయాన్ని గౌరవించిన ఆ నిర్మాత కుటుంబం వర్ష బొల్లమ్మతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సోషల్ మీడియా టాక్. పైగా అమ్మడు బయట కూడా వ్యక్తిత్వం విషయంలో సూపర్ అట. అందుకే ఆమెను కాదనేందుకు సదరు నిర్మాత కుటుంబం దగ్గర కారణాలేవీ కనిపించలేదట. దీంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ కూడా జరగనుందని టాక్. మరి ఈ విషయంపై నిజం ఎంతుందనేది వర్ష బొల్లమ్మ కానీ లేదంటే ఆ నిర్మాత కుటుంబం కానీ నోరు విప్పితే కానీ క్లారిటీ రాదు.
ఇక వర్ష బొల్లమ్మ కెరీర్ విషయానికి వస్తే చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మిడిల్ క్లాస్ మెలోడిస్ మూవీ అమ్మడి కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది వర్ష. కానీ అమ్మడికి ఎందుకోగానీ స్టార్ డమ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తాజాగా ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ సరసన స్వాతిముత్యంలో నటించింది.ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ను సాధించింది. విమర్శకుల మనసులను సైతం ఈ సినిమా గెలుచుకుంది.