తమిళంలో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తెలుగులోకి చూసిచూడంగానే అనే సినిమాతో అడుగుపెట్టిన అందాల భామ వర్ష బొల్లమ్మ. ఈ అమ్మడు విజయ్ బిగిల్ అనే సినిమాతో అంతకంటే ముందు తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇక డెబ్యూ మూవీతో పర్వాలేదనిపించుకున్న ఈ అమ్మడు తరువాత శర్వానంద్ జాను సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఆనంద్ దేవరకొండకి జోడీగా మిడిల్ క్రాస్ మెలోడీస్, రాజ్ తరుణ్ కాంబో లో స్టాండర్ అప్ రాహుల్, ఇప్పుడు బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ స్వాతిముత్యం సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ఇక ఈమె చేసిన సినిమాలు లో బడ్జెట్ తో వచ్చినవే అయినా కూడా నటిగా మాత్రం వర్షకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. హీరోలని డామినేట్ చేసే విధంగా ఆమె పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా వచ్సిన స్వాతిముత్యం సినిమాలో కూడా ఆమె పాత్ర అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఓ వైపు కామెడీ పండిస్తూనే మరో వైపు ఎమోషనల్ ఎలిమెంట్స్ కి కూడా చక్కగా చేసి మెప్పించింది. వర్ష కోసం ఈ సినిమాకి వెళ్లొచ్చు అనేంతగా తన అభినయంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా ఇంటర్వ్యూలో తన ఫెవరెట్ హీరో గురించి చెప్పింది. ఎన్టీఆర్ తనకి బాగా ఇష్టమైన హీరో అన చెప్పింది. తారక్ నటన, డాన్స్ లకి నేను పెద్ద ఫ్యాన్ అని పేర్కొంది. తారక్ కి హీరోయిన్ గా నటించడం తన కల అని, ఆ అవకాశం వస్తే జీవితంలో నాకు అంతకు మించిన ఆనందం ఉండదని వర్ష బొల్లమ్మ చెప్పడం విశేషం. ఇక తారక్ తో సినిమా చేసాక నటించకపోయిన పర్లేదనేలా నా కోరిక ఉందని ఈమె చెప్పి తనకున్న అభిమానాన్ని చాటుకుంది.