ఇళయదళపతి విజయ్ మొదటి సారిగా చేస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా వారసుడు. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని వంశీ పైడిపల్లి ఆవిష్కరిస్తూ ఉండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన విజయ్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. దీనిని బట్టి హై క్లాస్ బిజినెస్ ఫ్యామిలీలో జరిగే కథాంశంగా ఇది ఉండే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తుంది. రష్మిక మందన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పాటలు చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇప్పుడు డిజిటల్ రూపం అదిరిపోయే ఆఫర్ వచ్చింది.
దిల్ రాజు ఏకంగా ఈ సినిమా కోసం సుమారు వంద కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నాడు. అయితే డిజిటల్ రైట్స్ రూపంలోనే దిల్ రాజుకి వారసుడు 60 శాతం బడ్జెట్ వెనక్కి తిరిగి తెస్తుంది. తాజాగా దీనికి సంబందించిన వార్త టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. అలాగే శాటిలైట్ రైట్స్ , మ్యూజికల్ రైట్స్ కలిసి రిలీజ్ కి ముందే ప్రాఫిట్ ని దిల్ రాజు వారసుడు సినిమాతో తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అమెజాన్ ప్రైమ్ వారసుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఏకంగా 60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అలాగే శాటిలైట్ రైట్స్ కోసం సన్ నెక్స్ట్ 50 కోట్లు ఆఫర్ చేసింది.
ఆదిత్య మ్యూజిక్ కంపెనీ మ్యూజికల్ రైట్స్ కోసం 10 కోట్లు దిల్ రాజుకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా రిలీజ్ కి ముందు రైట్స్ ద్వారానే ఏకంగా120 కోట్లని వారసుడు సినిమా దిల్ రాజుకి తెచ్చిపెట్టడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక విజయ్ కి తమిళ్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో థీయాట్రీ రైట్స్ తమిళ్ లో భారీ ధరకి అమ్ముడుపోయే అవకాశం ఉంది. అలాగే తెలుగులో కూడా విజయ్ క్రేజ్ తో పాటు, దిల్ రాజు, వంశీ ఫేమ్ కూడా కలిసి మంచి బిజినెస్ జరుగుతుందని అంచనా ఉంది. ఏ విధంగా చూసుకున్న దిల్ రాజు కి ఈ సినిమా రిలీజ్ కి ముందే వంద కోట్ల ప్రాఫిట్ ఇవ్వడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.