ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వారసుడు. దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ భాషలలో నిర్మించారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక తమిళనాట ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
తెలుగులో దిల్ రాజు, వంశీ పైడిపల్లి కారణంగా బాగానే బజ్ ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తయినట్లు టాక్ వినిపిస్తుంది. డిజిటల్, శాటిలైట్ ఏకంగా 80 కోట్లకి అమ్ముడైపోయినట్లు సమాచారం. ఇక ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ ని ఏకంగా 10 కోట్లకి ఆదిత్య మ్యూజిక్ కంపెనీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళ్ రెండు భాషలలో ఈ మ్యూజిక్ రైట్స్ ని సదరు సంస్థ సొంతం చేసుకుందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్ ఒక సాంగ్ ని పాడారు. ఆ సాంగ్ ని దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరి విజయ్ పాడిన ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాపై నిర్మాత దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. అందుకే పోటీలో ఆదిపురుష్, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు ఉన్నా కూడా వారసుడు మూవీని అప్పుడే రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. అయితే ఆదిపురుష్ ని తెలుగు లో రిలీజ్ చేస్తుంది దిల్ రాజు కావడం గమనార్హం.