Varasudu: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ దళపతి క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈయనకు కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే విజయ్ నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇలా తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ సినిమాలు నేరుగా తెలుగు సినిమాలలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక ఇందులో విజయ్ సరసన రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మధ్యకాలంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయాయి.
ఇలా ఈయన సినిమాలు సరైన విజయాన్ని అందుకోకపోయినప్పటికీ దిల్ రాజు మాత్రం ధైర్యం చేసి భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే వారసుడు సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కనుక హిట్ అయితే దిల్ రాజు సేఫ్ జోన్ లోకి వెళ్తారు లేదంటే ఈయన భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 75 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
Varasudu: సంక్రాంతికి రానున్న వారసుడు..
ఇక ఈ సినిమాలో చివరి షెడ్యూల్ చిత్రీకరణ నేడు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా ఈ సినిమా విడుదల తేదీ గురించి కూడా అప్డేట్ విడుదల చేశారు.వారసుడు వచ్చేయడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఈ సందర్భంగా ఈ సినిమా విడుదల విషయంపై మేకర్స్ స్పందించారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.