Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు.సీనియర్ నటి రాధిక భర్త శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తెగా వరలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె ఎన్నో తమిళ సినిమాలలో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో సందడి చేశారు. ఈ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన వరలక్ష్మిని జయమ్మ గానే అభిమానులు గుర్తు పెట్టుకున్నారు.
ఇలా క్రాక్ సినిమా తర్వాత ఈమె నాంది, పక్కా కమర్షియల్ వంటి చిత్రాలలో సందడి చేశారు.ఇకపోతే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి యశోద సినిమాలో కూడా కీలకపాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలా పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ చేజింగ్ సినిమా ద్వారా మెయిన్ లీడ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డైరెక్టర్ కె వీరకుమార్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్ బ్యానర్ పై ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ బ్యానర్ పై ఇప్పటికే మై డియర్ భూతం, ఒరేయ్ బామర్ది వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.
Varalakshmi Sarathkumar: సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి
అన్యాయాలను ఎదిరించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఈమె ఈ సినిమాలో సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టారని త్వరలోనే ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయని బాలాజీ వెల్లడించారు ఇక ఈ సినిమాని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా బాలాజీ పేర్కొన్నారు.