ప్రేమ వ్యవహారంతో కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాగే మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేక, అలాగే ఆర్ధిక ఇబ్బందులు, వేధింపుల ఘటనలలో ఈ మధ్యకాలంలో బలవన్మరణాలు పెరిగిపోతున్నాయి. ఇలా సూసైడ్ చేసుకోవడంలో కేవలం సాధారణ మనుషులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఉంటున్నారు. తెలుగునాట ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరో కావాల్సిన వాడు అర్ధాంతరంగా ప్రాణం తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికి అక్కడి సెలబ్రెటీలని వెంటాడుతుంది.
బాలీవుడ్ లో నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడని విమర్శలు ఇప్పటికి వినిపిస్తున్నాయి. అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వారు ఉన్నారు. ఆమె సుశాంత్ ని డ్రగ్స్ కి బానిస చేసేసింది అనే ఆరోపణలు ఎదుర్కొంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ లో ఓ సీరియల్ నటి ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆమె కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు కావడం విశేషం. సుశాంత్ సింగ్ తో పాటు వైశాలి ఠక్కర్ సీరియల్స్ లో నటించింది. అతను హీరో అయ్యాక వైశాలి పలు హిందీ సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తూ బాగా రాణించింది.
అయితే ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందో. గత ఏడాదిగా ఆమె ఇండోర్ లో ఉంటుంది. వైశాలి టక్కర్ ససురల్ సిమర్ కా, సూపర్ సిస్టర్స్, విషయా అమృత్: సితార, మన్మోహిని 2 లాంటి సీరియల్స్ లో నటించింది. అలాగే హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇక ఆమె ఆత్మహత్యకి చేసుకోవడానికి ముందు రాసిన సూసైడ్ లెటర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని బట్టి ప్రేమలో విఫలం కావడం వలనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసింది. ఇక సుశాంత్ మరణం సమయంలో వైశాలి కూడా అతనిని హత్య చేశారని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. రియా చక్రవర్తి ప్రమేయం ఉందని కూడా ఆమె అప్పట్లో పేర్కొంది.