Vaani Kapoor : ఢిల్లీ బ్యూటీ వానీ కపూర్ తన వయ్యారాలతో వేడిని రగులుస్తోంది. పంజాబీ ఫ్యామిలీకి చెందిన ఈ బ్యూటీ తన అందచందాలతో కుర్రాళ్ళ గుండెను పంచర్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే వానీ కపూర్ తాజాగా తన హాట్ లుక్స్‌కి సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసేస్తోంది. వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న వానీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇటు సినిమాలతో పాటు అటు హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ వానీ కపూర్ తన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తాజాగా ఓ ఫోటో షూట్ కోసం బాలీవుడ్స్ ఫేవరేట్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన వైట్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని మెరిసిపోయింది. అతిపొడవుగా ఉన్న ఈ డ్రెస్‌లో తన వయ్యారాలను ఆరబోస్తూ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. మనీష్ మల్హోత్రా డిజైన్స్ అమితంగా అందరినీ ఆకట్టుకుంటాయనడానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది వానీకపూర్. ఈ డ్రెస్‌లోనూ వానీ ఎంతో హాట్ గా కనిపించి అభిమానులను ఖుషీ చేసింది.

డ్రమాటిక్ స్లీవ్స్, ఫ్లోరల్ షోల్డర్ డీటెయిల్స్, ఓపెన్ బ్యాక్ నెక్, డీప్ ప్లంగింగ్ నెక్‌లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా అతి పొడవైన్ ఫ్రిల్స్ కలిగిన స్కర్ట్ వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఈ డ్రెస్ ను డజైన్ చేసిన మనీష్ మల్హోత్రా వానీ యూ లుక్ స్టన్నింగ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌లో కమెంట్ పోస్ట్ చేశాడు. ఫ్యాన్స్ కూడా వానీ లుక్స్ చూసి లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో బాడీవుడ్‌లో అడుగుపెట్టిన వానీ కపూర్ మొదటి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమాకు గాను ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తరువాత టాలీవుడ్‌కు నానీ ఈ బ్యూటీని పరిచయం చేశాడు. ఆహా కళ్యాణంలో తొలిసారిగా నానీ సరసన నటించింది. అయితే ఈ మూవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో పాటు అమ్మడిది పూర్ పర్ఫార్మెన్స్ అన్న క్రిటిక్స్ బాగా వినిపించాయి. ఇక టాలీవుడ్‌కు సెలవు పలికిన ఈ భామ మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. ఆ తరువాత బేఫిక్ర్, వార్, బెల్ బాటమ్, వంటి సినిమాల్లోనూ నటించింది. ఇక 2021లో విడుదలైన చంఢీగర్ కరే ఆషికీ సినిమాలో ఈ భామ ట్రాన్స్ జెండర్‌గా నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. అంతే కాదు ఈ చిత్రంలోని ఆమె పెర్ఫార్మెన్స్‌కు గాను అవార్డును కూడా సొంతం చేసుకుంది.