యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రామాయాణం కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్రీడీలో ఈ మూవీని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది.
ఇక సైఫ్ ఆలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ ఇప్పటికే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 12 బాషలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు థీయట్రికల్ రైట్స్ ని యూవీ క్రియేషన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసమే యూవీ వారు 100 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ హోం బ్యానర్ లాంటిది. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఇదే బ్యానర్ నుంచి వచ్చాయి.
రాధేశ్యామ్ అయితే నష్టాలు తెచ్చింది. అయినా కూడా ప్రభాస్ ని గ్రాండ్ గా పరిచయం చేయాలని యూవీ క్రియేషన్స్ భారీగానే అతని సినిమాపై పెట్టుబడి పెట్టింది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమా తనకెంతో స్పెషల్ అని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల కంటే ప్రజల అంగీకారం ముఖ్యమని కూడా పేర్కొన్నారు. దీనిపై ప్రభాస్ చాలా నమ్మకంతో ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తుంది. ఈ సినిమా జనవరి 12 2023 న ప్రేక్షకుల ముందుకిరాబోతుంది. మరి ఈ సినిమా ప్రభాస్ అంచనాలని ఏ మేరకు అందుకుంటుంది అనేది చూడాలి.