Students Fight: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విద్యార్థులు పరస్పరం దాడి చేసుకోవడం జరిగింది. నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థులు దారుణంగా కొట్టుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కారు వేగంగా వచ్చి ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది. కారు ఢీకొన్న వెంటనే ఇద్దరు విద్యార్థులు గాల్లో ఎగిరి పడ్డారు. అయినా గాని తన్నుకోవడం ఆపలేదు. కింద పడ్డాక మళ్ళీ లేచి ఒకరిపై మరొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.
ఆ తర్వాత వెంటనే పోలీసులు రావడంతో విద్యార్థులంతా పరారయ్యారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకోవటం మాత్రమే కాదు ఢీకొన్న కారునీ సీజ్ చేయటం జరిగింది అంట. ఇక ఇదే సమయంలో మరొక కారులో ఈ తతంగం మొత్తం ఒక వ్యక్తి వీడియో తీయడం జరిగింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ ఘటనకు కారకులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని మసూరి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
https://twitter.com/i/status/1572731817148715009