ప్రస్తుతం ఇండియాలో బిగ్ బాస్ కున్న ఆదరణ మరే ఇతర షోకు లేదు.దాదాపు అన్ని భాషలలో నడుస్తున్న ఈ షో సీజన్ సీజన్ కు అభిమానులు పెంచుకుంటూ దూసుకుపోతుంది.అలాంటి ఈ షోలో ప్రతివారం నామినేషన్స్ ప్రకియ ద్వారా బిగ్ బాస్ యాజమాన్యం ఒక కంటెస్టెంట్ ను హౌస్ నుండి బయటకు పంపుతారు.అలా ఈసారి నామినేషన్స్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ కు టాలీవుడ్ హీరో రానా భార్య మిహికా మద్దతు పలికింది తన ఓటు తనకే అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తమిళ బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ అయిన అక్షర రెడ్డి రానా భార్య మిహికా క్లోజ్ ఫ్రెండ్ అట.అందుకే ఈసారి నామినేషన్స్ లో ఉన్న అక్షర రెడ్డికి మద్దతు పలుకుతూ పోస్ట్ పెట్టారు.దీంతో తమిళ బిగ్ బాస్ ను చూడని దగ్గుబాటి అభిమానులు అక్షర రెడ్డిని కాపాడే బాధ్యతను తీసుకుని ఆమెకు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తున్నారు.