కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు, దర్శకుడు ఉపేంద్ర. దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఉపేంద్ర తరువాత హీరోగా కూడా తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం కబ్జా సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉపేంద్ర ఉన్నాడు. ఇక హీరోగా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఉపేంద్ర తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించాడు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించాడు. ఆ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి ఎంత గుర్తింపు వచ్చిందో అంతే స్థాయిలో ఉపేంద్ర పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే పూజా హెగ్డే, సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఈ మూవీ టైటిల్ ని ఎనౌన్స్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఉపేంద్రని రంగంలోకి దించుతున్నాడని తెలుస్తుంది. ఇక ఉపేంద్ర కూడా ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. తెలుగు, తమిళ్ బాషలలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.