Unstoppable2: తెలుగులో విపరీమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ హీరో బాలయ్య. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలయ్య.. అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహాలో అన్ స్టాపబుల్ పేరుతో సెలబ్రెటీలతో టాక్ షో నిర్వహించగా.. మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది.
అదే దూకుడుతో మరోసారి అన్ స్టాపబుల్2 పేరుతో రెండో సీజన్ ని ఆహా సంస్థ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ ని చేశారు. ఇది భారీ హిట్ కావడంతో.. అన్ స్టాపబుల్2కి భారీ రేటింగ్ వచ్చింది.
ఆ తర్వాత రెండో ఎపిసోడ్ ని విశ్వక్ సేన్, డిజే టిల్లు ఫేం సిద్దుతో బాలయ్య చేశాడు. ఇప్పడు ఈ షోకి మూడో ఎపిసోడ్ గెస్ట్ గా ఎవరు వస్తారనే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో బాలయ్యతో ఒకప్పుడు సినిమాలు చేసిన హీరోయిన్, ఇప్పటి మంత్రి రోజా వస్తారనే టాక్ నడుస్తోంది. రాజకీయంగా ఒకరు వైసీపీలో మరొకరు టీడీపీలో ఉన్న వీరిద్దరు కలిసి ఒకే వేదిక మీద కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Unstoppable2:
అయితే రోజా, బాలయ్యల మధ్య చనువు ఉన్న మాట వాస్తవమే అని కానీ రాజకీయ పరిణామాల దృష్యా రోజా బాలయ్య షోకి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయం జగన్ కి తెలిస్తే.. అస్సలు ఉపేక్షించరని టాక్. అందుకే రోజా అన్ స్టాపబుల్2లో కనిపించే అవకాశం లేదని అంటున్నారు. కాగా జబర్దస్త్ షోలో ఒకసారి రోజా నేరుగా బాలయ్యకి కాల్ చేయడం, బాలయ్య కూడా ఎంతో ఎనర్జీతో పాజిటివ్ గా మాట్లాడటం తెలిసిందే.