బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలయ్య స్టైల్ ఆఫ్ ఫన్ తో నడిచిన ఈ ఈ రియాలిటీషోకి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ నేపధ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఆహా వారు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ షో కూడా దిగ్విజయంగా నడుస్తుంది. ఇప్పటికే ఈ సీజన్ 2లో భాగంగా మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. నాలుగో ఎపిసోడ్ ఇప్పటికే ప్రసారం కావాల్సిన ఉన్న కూడా బాలకృష్ణ మూవీ షూటింగ్ కారణంగా కుదరలేదు. ఇక ఈ షోకి గెస్ట్ లుగా సినీ, రాజకీయ ప్రముఖులు అందరిని కూడా తీసుకురావాలని ఆహా టీం అలొస్తుంది. అందులో భాగంగా మొదటి ఎపిసోడ్ నే నారా చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేశారు.
ఈ ఎపిసోడ్ పెద్ద సక్సెస్ అయ్యింది. తరువాత యంగ్ హీరోలతో ఎపిసోడ్స్ చేశారు. అవి కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. నెక్స్ట్ అన్ స్టాపబుల్ కి వచ్చే గెస్ట్ ల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పని చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన రాజకీయాలకి కాస్తా దూరంగా ఉన్నారు.
అయితే అతన్ని ఈ షోకి పొలిటికల్ గెస్ట్ గా తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సెలబ్రెటీ సీనియర్ హీరోయిన్ రాధికని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె కూడా రావడానికి ఆసక్తిగానే ఉందని తెలుస్తుంది. సీనియర్ హీరోయిన్ రాధిక చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ అందరితో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆమెని తీసుకొస్తే ఆ పాత జ్ఞాపకాలని మరోసారి గుర్తు చేసినట్లు అవుతుందని భావించి ఆహా టీమ్ ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. ఏదో ఒక ఎపిసోడ్ లో ఈమె కనిపించడం పక్కా అనే మాట ఇప్పుడు చిత్రపురిలో వినిపిస్తుంది.