Unstoppable2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు రాయాలన్నా, వాటిని బ్రేక్ చేయాలన్నా మేమే అంటూ నందమూరి బాలయ్య చెప్పిన డైలాగ్.. అక్షరసత్యం అని మరోసారి రుజువైంది. కేవలం సినిమాలతోనే కాదు, టాక్ షోతో కూడా బాలయ్య ఓ రేంజ్ లో కుమ్మేస్తాడనే విషయం తెలుగు జనాలకు అర్థమైపోయింది. ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ‘ఆహా’లో బాలయ్య హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్2’ రికార్డుల మోతమోగిస్తోంది.
సినిమాల్లో డైలాగులతో అదరగొట్టే బాలయ్య.. రియల్ లైఫ్ లో కాస్త తడబడతారనే టాక్ ఉంది. కానీ అలాంటిదేమీ లేదంటే తన టాక్ షో ద్వారా బాలయ్య నిరూపించాడు. గతంలో ఎప్పుడూ చూడని బాలయ్యను ఆహాలో ‘అన్ స్టాపబుల్’తో చూపించారు. మొదటి సీజన్ భారీగా హిట్ అవడంతో, సీజన్ 2 మీద భారీ అంచనాలే ఉండేవి.
‘అన్ స్టాపబుల్2’ మొదటి ఎపిసోడ్ తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో అంటూ ఆహా ప్రకటన విడుదల చేయగానే ఆ హైప్ మరింత పెరిగింది. ‘అన్ స్టాపబుల్2’ ప్రోమోలో అందరూ ఊహించినట్లే ఎన్టీఆర్ ఎపిసోడ్ మీద బాలయ్య, చంద్రబాబులు మాట్లాడుకోవడంతో.. భారీగా రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 14వ తేదీ రిలీజ్ అయిన ‘అన్ స్టాపబుల్2’ మొదటి ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా కొత్త రికార్డులను సృష్టించింది.
ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ‘ఆహా’లో విడుదలైన బాలయ్య ‘అన్ స్టాపబుల్2’ మొదటి ఎపిసోడ్ కు 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. బాలయ్య హోస్ట్ గా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు గెస్టులుగా వచ్చిన ఈ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. బాలయ్య తనదైన పంచులతో టాక్ షోని రక్తి కట్టించాడు.
Unstoppable2:
అటు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా యూట్యూబ్ లో అదరగొట్టింది. విడుదలైన ఈ ప్రోమో టాప్ ట్రెండ్స్ లో ఉంది. ఓటీటీ వేదికగా బాలయ్య టాక్ షో చేయడం ఒక ప్రయోగం అయితే, అది కమర్షియల్ గా సక్సెస్ అవడం అనేది అనితర సాధ్యం అనే చెప్పుకోవాలి.
View this post on Instagram