Unstoppable Season 2: ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ వన్ చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేయడం మరో విశేషం. అయితే బాలకృష్ణ మూలంగా ఈ షో వేరే లెవెల్ కు వెళ్లిందని చెప్పాలి. అదేవిధంగా ఈ షోకు చాలా మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ షోలో సినీ ప్రముఖులను రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి బాలకృష్ణ గారు తనదైన స్టైల్ లో తమ వ్యక్తిగత ప్రశ్నలను అడిగి జవాబులను రాబట్టారు. ఈ విధంగా సీజన్ వన్ పూర్తి చేసుకుంది. అయితే సీజన్ 2 కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన టీజర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యాయి.
ఈ టీజర్ ట్రైలర్ కూడా సీజన్ వన్ కు డబల్ త్రిబుల్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ సీజన్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 చంద్రబాబు గారితో మొదలవ్వనున్నది. మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన మొదటిసారిగా టాక్ షోకు రావడంతో తెలుగుదేశం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది.
ఇందులో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ గారు కూడా విచ్చేసి సందడి చేశారు. ఇందులో బాలకృష్ణ చంద్రబాబు గారితో మీ జీవితంలో మీరు చేసిన రొమాంటిక్ పని ఏంటి అని అడగ్గా.. నీ కన్నా చాలా చేశాను.. మీరు సినిమాలో చేశారు.. నేను స్టూడెంట్ గా చేశాను.. అమ్మాయిలు కనిపించగానే.. సైలెన్సర్ తీసేసేవాడిని.. అని ఆయన వ్యక్తిగత విశాలను పంచుకున్నారు చంద్రబాబు గారు.
Unstoppable Season 2: బాలకృష్ణపై చంద్రబాబు సీరియస్
అదేవిధంగా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడగ్గా.. రాజశేఖర్ రెడ్డి అని సమాధానం ఇచ్చారు. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్ప? కాళ్ళు పట్టుకొని అడిగా అని ఆయన బాలకృష్ణ ను ఉద్దేశిస్తూ.. సీరియస్ గా మాట్లాడారు.
ఇక నారా లోకేష్ గారు కూడా కాసేపు వ్యాఖ్యాతగా బాలకృష్ణ గారిని అలాగే చంద్రబాబు గారిని తనకు కావాల్సిన ప్రశ్నలను అడిగి జవాబులు రాబట్టారు. ఈ విధంగా ఆ ఎపిసోడ్ అంత నవ్వులు పూయించారు.