Unstoppable 2: లక్ష్మి పార్వతి..నందమూరి కుటుంబంలో అనుకోని వివాదాలకు కారణమైన మహిళగా నందమూరి అభిమానులు అనుకుంటారు. రచయితగా ఎన్టీఆర్ ఆత్మ కథ రాస్తానని నందమూరి కుటుంబంలోకి అడుగు పెట్టి ఎన్టీఆర్ భార్యగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఈ ఇష్యూ పెద్ద వివాదమే రేపింది. ఇప్పటికి లక్ష్మి పార్వతి కి మరియు నందమూరి కుటుంబానికి అసలు పడదు అనే విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ వార్త మళ్ళీ ఎందుకు బయటకు వచ్చిందంటే బాల కృష్ణ అన్స్టాపబుల్ షో కి లక్మి పార్వతి అతిధి గా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలకృష్ణ నటుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నాడు. ఆహా ఆప్ లో ప్రసారమవుతున్న ఈ షో మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ సీజన్లోకి అడుగు పెట్టింది. అయితే రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు ఎంట్రీ నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎందుకంటే అప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు మాత్రమే ఈ షో కి గెస్ట్ గా వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు తో చాలా విషయాలను చర్చించారు. స్వయంగా తన బావ గారే కావడంతో తాను అడగాల్సిన విషయాలను అడిగేశాడు. ఇదే సమయంలో ఆగస్టు లో జరిగిన సంక్షోభం గురించి కూడా చర్చించారు. అప్పుడు నేను చేసింది తప్పా అని బాలకృష్ణని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో విషయం బయటికి వచ్చింది.
Unstoppable 2:
ఇదే షో కి లక్ష్మి పార్వతి ని కూడా తీసుకొస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వేళ లక్ష్మి పార్వతి వస్తే ఎలా ఉంటుంది. అసలే నందమూరి కుటుంబానికి ఆమెకు అసలు పడదు. నందమూరి కుటుంబం పై సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంటుంది. అలాంటిది వీళ్లిద్దరు కలిసి షో చేస్తారా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.ఒక వేళ తాను వస్తే ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటుంది అని కూడా ఆలోచిస్తున్నారు.