Unstoppable 2: మాస్ సినిమాలకు కేరాఫ్ గా, ఫ్యాక్షన్ అయినా, యాక్షన్ అయినా అదరగొట్టే నటుడు ఎవరబ్బా అంటే అందరూ నందమూరి బాలయ్య పేరు చెబుతారు. ఒక పక్కన సినిమాలు చేస్తూనే ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహాలో ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఎంటర్టైన్ చేసిన బాలయ్య… మరోసారి పవర్ ప్యాక్ తో సిద్ధమైపోయినట్లు కనిపిస్తోంది.
ఆహాలో ‘అన్ స్టాపబుల్’ సూపర్ హిట్ అవడంతో.. అందరూ ‘అన్ స్టాపబుల్2’ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ అంచనాలను భారీగా పెంచేలా ‘అన్ స్టాపబుల్2’ ట్రైలర్ అదరగొట్టేసింది. అన్ స్టాపబుల్2 ట్రైలర్ లో బాలయ్య బాబు కనిపించిన తీరు, ఆయన చెప్పిన డైలాగులు షో మీద అంచనాలను రెట్టింపు చేసేశాయి.
‘ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్, సరదాల్లో మరింత సెటైర్, మరింత రంజుగా, దెబ్బకి థింకింగ్ మారిపోవాలా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగులకు దుమ్మురేగింది. గతంలో కన్నా ఈసారి బాలయ్య మరింత అదరగొట్టడానికి, ఫుల్ జోష్ లో ఉన్నాడని, వచ్చే గెస్టులతో ఓ ఆట ఆడబోతున్నట్లు కనిపిస్తోంది. ఎంతో ప్రామిసింగ్ గా ఉన్న ‘అన్ స్టాపబుల్2’ ట్రైలర్ ఈసారి బాలయ్యను ఎవరూ అందుకోలేరనే అంచనాను క్రియేట్ చేస్తోంది.
Unstoppable 2: 
అక్టోబర్ 14వ తేదీ నుండి ప్రతి శుక్రవారం రానున్న బాలయ్య ‘అన్ స్టాపబుల్2’లో ఈసారి ఎవరెవరు గెస్టులుగా వస్తారనే చర్చ మొదలైంది. మొదటి ఎపిసోడ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండబోతున్నట్లు వార్తలు రాగా, షూటింగ్ లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం తెలిసిందే.