బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్ స్టాపబుల్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2కి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఆహా నుంచి అప్డేట్స్ వచ్చాయి. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చూడని సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవిని మొదటి ఎపిసోడ్ కోసం బాలకృష్ణ ఇంటర్వ్యూ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ సీజన్ లో స్టార్ సెలబ్రెటీలని రంగంలోకి తీసుకురాబోతున్నారు. వారిలో అనుష్క, ప్రభాస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
వీరితో ఈ సారి మరింతగా షోకి రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ అంతమ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. దీనికి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ షోకి సంబంధించిన అంథమ్ కి కూడా మంచి స్పందన వస్తుంది. దీనిని బట్టి హోస్ట్ గా బాలయ్యబాబు పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో ఉన్నారు.
ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆహాకి సంబందించిన ఫస్ట్ ఎపిసోడ్ షూట్ జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిపోయిందని టాక్ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ సీజన్2కి మాత్రం ఈ సారి విశేషమైన స్పందన వస్తుందని చెప్పాలి. మరి ఎప్పటి నుంచి ఈ షో ప్రారంభం అవుతుంది అనేది ఎప్పుడు ప్రకటిస్తారా అనే ఆసక్తి నందమూరి అభిమానులతో పాటు ఈ అన్ స్టాపబుల్ అభిమానులలో కూడా ఉంది.