ప్రపంచంలో ఉన్న కొన్ని వింత ఆచారాలు మనల్ని ముక్కున వేలు వేసుకునేలా చేస్తుంటాయి.అలాంటి ఆచారాలలో కొన్ని మన భారతదేశంలో కూడా ఉన్నాయి.వాటిలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పిని అనే ఓ చిన్న గ్రామంలో పాటిస్తారు.ఈ గ్రామం మొత్తం జనాభా 2,593 మంది.సముద్ర మట్టానికి సుమారు 1950 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామంలో ఏటా ఆడవారు ఐదు రోజుల పాటు నగ్న దీక్షను చేపడుతారు.
ఈ దీక్ష సమయంలో ఆడవారు నగ్నంగా తమ పనులను తాము చేసుకుంటారు.ఈ దీక్షను పురుషులు కూడా తీసుకుంటారు.ఆ దీక్షలు తీసుకునే సమయంలో ఆ గ్రామంలోకి ఎవర్ని రానివ్వరు.ఈ దీక్ష తీసుకోవడం వెనక ఒక కథ ఉంది దాని ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో ఉన్నవారిని రాక్షసులు నానా ఇబ్బందులకు గురి చేస్తుండేవారు.ఆడవారిపై అత్యాచారాలు చేస్తుండేవారు.ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న లాహు ఘోండ్ అనే దేవత ఆ రాక్షసుల్ని వధించి ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ నిచ్చింది.
మహిళల మానాన్ని కాపాడిన ఆ దేవతకు తమ భక్తిని చాటుకునేందుకు ఇక్కడి వారు ఈ నగ్న దీక్షను చేపడుతారు.