Un Stoppable: నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని తాజాగా ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా అందరికీ తెలిసింది. ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి అద్భుతమైన రేటింగ్ సంపాదించి పెట్టారు.
ఇకపోతే మొదటి సీజన్ ఎంతో విజయవంతం కావడంతో రెండవ సీజన్ అంతకుమించి ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ లో కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఆహా నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభం చేయనున్నారు.
ఈ క్రమంలోనే అక్టోబర్ 4వ తేదీ విజయవాడలో ఏకంగా 30 వేల మంది అభిమానుల సమక్షంలో ఆహా అన్ స్టాపబుల్ సీజన్2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం బాలకృష్ణ నాల్గవ తేదీ ఉదయం ప్రత్యేక జెట్ విమానంలో విజయవాడ చేరుకోనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొనడం కోసం పెద్ద ఎత్తున పాస్ లకు ఎగబడుతున్నారని అభిమానుల తాకిడి తట్టుకోలేకపోతున్నామని నిర్వాహకులు వెల్లడించారు.
Un Stoppable: పకడ్బందీగా ఏర్పాట్లన్ని పూర్తి..
ఏది ఏమైనా ఒక ఓటిటి చానల్లో ప్రసారమయ్యే టాక్ షో కార్యక్రమాన్ని ఇలా ఇంత ఘనంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం విశేషం. ఇలా ఈ కార్యక్రమాన్ని ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కోసం విజయవాడలో ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లను కూడా చేసినట్టు తెలుస్తోంది. మరి సీజన్ వన్ ద్వారా అందరిని అలరించిన బాలయ్య సీజన్ 2 ద్వారా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.