సన్ రైజర్స్ తరుపున ఈసారి ఐపీఎల్ లో బరిలోకి దిగిన ఉమ్రాన్ మాలిక్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గంటకు 150 కిలోమీటర్లు వేగంతో బాల్ ను విసిరాడు అలాగే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గంటకు 152.95 కిలోమీ వేగంతో బాల్ ను విసిరి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.జమ్మూ కశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ను సరిగ్గా వినియోగించుకుంటే రానున్న కాలంలో అతడు ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందిస్తాడని క్రికెట్ పెద్దలు నమ్ముతున్నారు.అందుకే వారు అతన్ని టీ20 వరల్డ్ కప్ లో నెట్ బౌలర్ గా ఎంపిక చేయాలని బిసిసిఐకు సూచించినట్లు తెలుస్తుంది.
సీనియర్స్ సూచనలను పరిగణనలోకి తీసుకున్న బిసిసిఐ వారి సూచనలు ప్రకారం ఉమ్రాన్ మాలిక్ ను టీ20 వరల్డ్ కప్ లో నెట్ బౌలర్ గా ఎంపిక చేసింది.అలాగే వెంటనే అతన్ని భారత జట్టు బయో బబుల్ లో జాయిన్ కావాలంటూ సమాచారం అందించిందన్న ప్రచారం జరుగుతుంది.