Ukraine russia war: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీనికి అంతెప్పుడా అని ఇరు దేశాల ప్రజలూ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ పై పైచేయి సాధించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తాత్కాలిక సైనిక సమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని రైతులు, యువతను పెద్ద ఎత్తున సైన్యంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారాయన.
అక్కడి యువత పెద్ద ఎత్తున తరలి రాగా, రష్యన్ మిలటరీ తలలు పట్టుకుంటోంది. కనీస ఆర్మీ ప్రమాణాలకు సరితూగడం లేదని చాలా మందిని వెనక్కు పంపేస్తున్నారు. మరోవైపు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది పారిపోతున్నారు. మరికొందరు కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు.
Ukraine russia war: యుద్ధానికి వెళ్లకుండా ఉండేందుకు…
తాజాగా ఓ వ్యక్తి యుద్ధానికి వెళ్లకుండా ఉండేందుకు మరో వ్యక్తి సాయంతో తన చేతిపై సుత్తితో కొట్టించుకున్నాడు. దీంతో అతడి చెయ్యి విరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఓరి దేవుడా యుద్ధం మా ప్రాణాల మీదకు వచ్చింది కదయ్యా.. అంటూ యువతతో పాటు దేశ పౌరులంతా ఆందోళన చెందుతున్నారు.