Udaya Bhanu : బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా బాగా అలరించే షోస్‌లో ఒకటిగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మరికొద్ది రోజుల్లో 6వ సీజన్‌లోకి అడుగు పెట్టబోతోంది. దీనికున్న క్రేజ్ దృష్ట్యా బిగ్‌బాస్ యాజమాన్యం సైతం పెద్దగా సమయం తీసుకోకుండా వీలైనంత త్వరగా షోని ప్రారంభించాలని భావిస్తున్నారు. దాదాపు సెప్టెంబర్ మొదటి వారంలో ఆరో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ షోపై రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. 4వ సీజన్ వరకూ హోస్ట్ గురించి కూడా పెద్ద ఎత్తునే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు హోస్ట్ పక్కాగా కింగ్ నాగార్జునే ఉంటారని తెలియడంతో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
Udaya Bhanu : ఆమె తర్వాతే సుమ కనకాల అయినా.. మరొకరైనా..
ఇక మిగిలిందల్లా కంటెస్టెంట్స్. ప్రస్తుతం హౌజ్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. సీజన్ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా ఒకప్పటి స్టార్ యాంకర్, బుల్లితెర శ్రీదేవిగా పేరు తెచ్చుకున్న ఉదయభాను పేరు వచ్చి చేరింది. ఒకప్పుడు బుల్లితెరపై ఉదయభాను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పట్లో బుల్లితెరకు ఆమే క్వీన్. ఆమె తర్వాతే సుమ కనకాల అయినా.. మరొకరైనా. ఆ తరువాత ఏవో కాంట్రవర్సీలు ఆమెను చుట్టేయడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. మెల్లిమెల్లిగా బుల్లితెరకు దూరమైంది. తిరిగి ఇటీవలి కాలంలో మళ్లీ కొన్ని షోస్, ఈవెంట్స్‌లో కనిపిస్తోంది. అది కూడా యాంకర్‌గా కాదు.
అయితే ఉదయ భానుకి ఇప్పటికీ క్రేజ్ అలాగే ఉంది. దీంతో ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని బిగ్‌బాస్ నిర్వహకులు భావిస్తున్నట్టు టాక్. ఇప్పటికే ఆమెను సంప్రదించారని కూడా సమాచారం. అవకాశాలు కూడా పెద్దగా లేకపోవడంతో ఆమె కూడా బిగ్‌బాస్‌కు ఓకే చెప్పిందని టాక్. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఎవరికీ ఇవ్వనంత పెద్ద మొత్తాన్ని ఉదయభానుకు రెమ్యూనరేషన్‌గా ఇస్తామంటూ బిగ్‌బాస్ నిర్వాహకులు ఆఫర్ ఇచ్చారట. ఇంత మంచి అవకాశాన్ని ఆమె మాత్రం ఎందుకు వదులుకుంటుంది? ఆనందగా ఒప్పేసుకుందట. మొత్తానికి ఈ క్రేజీ యాంకర్ బిగ్‌బాస్ సీజన్ అందుకే ఆమెను సంప్రదించి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.