బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా ముసిగింది. అందరూ ఊహించినట్లే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ అఫీషియల్ గా ఎంపిక అయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలో అంత ఆసక్తికరంగా అయితే నడవలేదు. కాని మొదటి నుంచి రేవంత్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అతనే విన్నర్ అవుతాడని అందరూ భావిస్తూ వచ్చారు. ఓటింగ్ పరంగా కూడా రేవంత్ ఎప్పుడు టాప్ లోనే ఉన్నారు. అన్ని రకాలుగా తన బ్రాండ్ ని రేవంత్ కాపాడుకుంటూ వచ్చాడు. హౌస్ లో కోపం ఎక్కువ ఉన్న వ్యక్తి అనే ముద్ర వేసుకున్న ఆటలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన పూర్తి సామర్ధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇక శ్రీ హాన్ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్న శ్రీహాన్ ఆరంభంలో అంటగా పాపులర్ కాకుండా మెల్లగా తన ఆటతో, మాటతో టాప్ లోకి వచ్చాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఫైనల్ పొజిషన్ వరకు వచ్చేశాడు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు మూడో వ్యక్తికి మనీ ఆఫర్ చేసేవారు.
ఇలా ఆఫర్ చేసిన మనీని కొంత మంది తీసుకున్నారు. కొంత మంది తీసుకోలేదు. అయితే ఈ సీజన్ 6లో మాత్రం మూడో వ్యక్తికి 20 నుంచి 30 పర్సెంట్ వరకు ఆఫర్ చేశారు. అయితే మూడో స్థానంలో ఉన్న కీర్తి దానిని తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆమె థర్డ్ ప్లేస్ లో ఎలిమినేట్ అయ్యింది. అయితే అనూహ్యంగా హోస్ట్ నాగార్జున టాప్ 2 లో ఉన్న ఇద్దరికీ మనీ ఆఫర్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీలో ఏకంగా 90 శాతం ఒకరికి ఆఫర్ చేశారు. అయితే ముందు మూడో స్థానంలో డబ్బుని తీసుకోవడానికి నిరాకరించిన శ్రీహాన్ అనూహ్యంగా 40 లక్షల ఆఫర్ ని వద్దనుకోలేకపోయాడు. అతని తండ్రి కూడా ఆ ఆఫర్ ని తీసుకొని చెప్పడంతో ఫైనల్ గా క్యాష్ ఆఫర్ ని శ్రీహాన్ తీసుకున్నాడు. దీంతో రేవంత్ ఈ షోలో విన్నర్ అయ్యాడు.
అయితే మొత్తం అయ్యాక హోస్ట్ నాగార్జున ఊహించని షాక్ ఇచ్చాడు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం రేవంత్ కంటే శ్రీహాన్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయని ప్రాక్టికల్ గా అయితే శ్రీహాన్ విన్నర్ అయ్యే అవకాశం ఉన్న అతను క్యాష్ ఆఫర్ తీసుకున్నాడు కాబట్టి రేవంత్ అఫీషియల్ గా ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ అని ప్రకటించారు. రేవంత్ బిగ్ బాస్ విన్నర్ కావడం ద్వారా అతనికి ఫ్రైజ్ మనీ 10 లక్షలు మాత్రమే వచ్చిన, సువర్ణభూమి ఫ్లాట్, కారు బహుమతిగా వచ్చాయి. వాటితో కలిసి 50 లక్షల వరకు విన్నర్ గా అతను అందుకున్నాడు.
ఇక క్యాష్ ఆఫర్ తీసుకోవడం ద్వారా శ్రీహాన్ కూడా విన్నర్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా 40 లక్షల మనీని అందుకున్నాడు. అయితే రేవంత్ ని విన్నర్ గా ప్రకటించడం కోసమే శ్రీహాన్ కి ఓటింగ్ ఎక్కువ వచ్చిన కూడా క్యాష్ ఆఫర్ తో అతన్ని రన్నర్ కి పరిమితం చేసేసారని తెలుస్తుంది. ఇలా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా శ్రీహాన్ ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ అయితే, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం అఫీషియల్ గా రేవంత్ విన్నర్ గా నిలిచాడు. ఇలా ఈ సీజన్ మొదటిసారిగా టాప్ 2 లో ఉన్న ఇద్దరు విన్నర్స్ గానే బయటకి రావడం విశేషం.