BIGG BOSS: గత సీజన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో బలమైన కంటెస్టెంట్స్ తక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. సింగర్ రేవంత్, చలాకి చంటి ఇలా వేలి మీద లెక్కపెట్టవచ్చు. మిగతా సభ్యులు వారి వారి ప్రోఫెషన్స్ లో తోపులు అయినప్పటికీ తెలుగు ప్రజలకు మాత్రం అంత పెద్దగా గతంలో కెనెక్షన్ లేదనే చెప్పవచ్చు. బిగ్ బాస్ షో గురించి రివ్యూలు చెప్పే ఆదిరెడ్డి కంటెస్టెంట్ గా వచ్చారంటే మీరే ఇక మీరే ఊహించుకోండి.!
ఈ సీజన్ లో షానీ, అభినయ, నేహా చౌదరి, ఆరోహి, చంటి, బాలాదిత్య, రేవంత్, మెరీన, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, ఫైమా, ఇనయ, అర్జున్, సుదీప, కీర్తి, వసంతి, గీతూ, సూర్య కంటెస్టెంట్స్ గా ఉన్నారు. వీరిలో ఎవరు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు అనేది అందరికీ తెలిసిందే..! వీరిలో ఎవరు ఎలా ప్రదర్శన చేస్తున్నారు అనే దానిపై ప్రతి వారం నాగార్జున ఏదో ఒక రూపంలో రివ్యూలు పెడుతూనే ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి ఇప్పటికే ఎలిమినేషన్ అయ్యారు.

ఎప్పటి మాదిరిగానే ఈ ఆదివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. కొన్ని సామెతలు రాసి ఉన్న బోర్డులను తెప్పిస్తాడు. ఈ సామెతలు వర్తిస్తాయో వారి మెడలో వేసి ఎందుకు వర్తిస్తుందో వివరించాలని నాగార్జున హౌస్ సభ్యులకు చెప్తాడు. దీంతో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో సామెతను తీసుకుని ఒక్కొక్కరికి వేసి అది వారికి ఎందుకు వర్తిస్తుందో అనేది వివరించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆకై ఏకుగా మారిందనే సామెతను హౌస్ సభ్యులు ఇద్దరు కంటెస్టెంట్స్ కి వాడతారు.
మందు గీతూ ఈ సామెతను శ్రీహాన్ కు వర్తిస్తుందని చెప్తుంది. ఎందుకంటే… మొదటి మూడు వారాలు ఏంది ఈ పిల్లొడు ఎందుకు వచ్చాడు అని అనుకున్నాను.. కానీ ముందు అన్నీ గమనించి తర్వాత వీక్ నుండి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు అని గీతై చెప్తుంది. ఇక ఇదే విధంగానే ఇనయ కూడా తనదైన శైలిలో తన గేమ్ ను మెరుగు పరుచుకుంటూ వారం వారం మరింత ఆటతీరును కనబరుస్తూ హౌస్ లో ఆకుగా ఉన్న ఇనయ మేకుగా మారిందని చెప్తాడు రాజ్.. మరి ఈ మేకులు హౌస్ లో ఎన్ని వారాలు ఉంటాయి.. లేదా కప్ గెలుస్తాయా అనేది మరికొన్ని రోజులు వేచి చూద్దాం..!